సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతున్న దాసరి

By Bojja Kumar

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు, 150 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యధిక హిట్లు కొట్టిన దర్శకుడిగా చరిత్రకెక్కారు. అయితే ఆయన చివరగా తీసిన సినిమాలు యంగ్ ఇండియా, పరమవీర చక్ర చిత్రాలు ప్లాపవ్వడంతో కొంత కాలంగా ఆయన దర్శకత్వంలో సినిమాలేవీ రాలేదు. దాసరికి చెందిన సంస్థలు సినిమా డిస్ట్రిబ్యూషన్ పై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇక ఆయన దర్శకత్వానికి దూరం అయినట్లే అని అంతా భావించారు.

అయితే... దాసరి దర్శకత్వ ప్రస్థానానికి ఇంకా పులిస్టాప్ పడ లేదని, ఆయన 151వ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది. త్వరలో ఆయన భారీ బడ్జెట్ తో ఓ సినిమా తీయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి ఈచిత్రం ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా దాసరి భార్య పద్మ మరణంతో ఈ ప్రాజెక్టు లేటయిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

అంతే కాదు...తన ఆత్మకథ పుస్తకంలో పరిశ్రమకు సంబంధించిన రహస్యాలను, ఆసక్తికర విషయాలను బయటపెట్టి సెన్సేషన్ సృష్టించేందుకు దాసరి నిర్ణయించుకున్నారని సమాచారం. దాసరి ఆత్మకథ అనగానే సినీ జనాల్లో ఆసక్తి క్రియేట్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో టాప్ దర్శకుల్లో దాసరి ఒకరు. దివంగత ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి హీరోల వరకు అనేక మందిని ఆయన దర్శకత్వంలో చేసారు. జనాలకు తెరపై కనిపించేది మాత్రమే తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో తెర వెనక చాలా వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.

ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనించిన దాసరి వాటిని తన ఆత్మకథ ద్వారా బయట పెడతారనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా సినీ పరిశ్రమ ఇప్పుడిలా ఎందుకు తగలడింది? చిన్న నిర్మాతలు ఎందుకు చితికి పోతున్నారు? పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకుని గుత్తాదిపథ్యం సాగిస్తుంది ఎవరు? దీని వల్ల భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అనే వివరాలు కూడా దాసరి తన ఆత్మకథలో చర్చిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా దాసరి ఆత్మకథ అనగానే చాలా మందిలో గుబులు కూడా మొదలైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X