దాసరి మళ్ళీ మొదలెడితే యంగ్ ఇండియన్స్ కి హింస తప్పదు...
చరిత్ర సృష్టిస్తానంటూ దాసరి నారాయణరావు నమ్మకంగా చెబుతోంటే అభిమానులంతా 'చరిత్ర"ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ దాసరి మాత్రం అన్నమాట నిలబెట్టుకున్నారు. నిజంగానే తన నూట యాభైవ చిత్రంతో చరిత్ర సృష్టించారు. 'పరమవీర చక్ర" తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యంత దారుణమైన పరాజయంగా రికార్డులకెక్కింది. స్టార్ హీరో నటించిన సినిమా కష్టపడి రెండు కోట్ల పైచిలుకు షేర్ తో సరిపెట్టుకోవడం, అదీ 2011లో..అంటే అది ఆషామాషీ రికార్డు కాదు. పెట్టిన పెట్టుబడి దాదాపుగా తొంభై శాతం పోయినట్టే, అంటే అది ఇతరుల వల్ల సాధ్యపడదు. దాసరి నారాయణరావు సృష్టించిన ఈ రికార్డు బాలకృష్ణ కెరీర్ కే మచ్చగా మిగిలిపోతుంది.
దాసరితో సినిమా చేస్తానని మాటిచ్చినందుకు, దానిని నిలుపుకున్నందుకు బాలకృష్ణ ఈ పరమ ఘోర పరాజయాన్ని మోయక తప్పదు. తన దర్శకత్వానికి వృద్ధాప్యం వచ్చేసిందని దాసరి ఇకనైనా తెలుసుకుని తన ఫైనల్ కౌంట్ 150తో సరిపెడితే బాగుంటుందని చిత్ర పరిశ్రమ బాగు కోరుకునే వారంటున్నారు. మెగా హిట్టిచ్చి కానీ రిటైర్ కానని పట్టుబడితే మాత్రం మరిన్ని పరమవీర చక్ర లతో యంగ్ ఇండియన్స్ కి హింస తప్పదు.


Click it and Unblock the Notifications











