»   » ఈక్వేషన్స్ మారితేనేమి? :పవన్ మళ్లీ చెప్పాడు, దాసరి ఫుల్ హ్యాపీ

ఈక్వేషన్స్ మారితేనేమి? :పవన్ మళ్లీ చెప్పాడు, దాసరి ఫుల్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావుకి మొత్తానికి రిలీఫ్ వచ్చినట్లే. ఎందుకంటే గత కొద్ది రోజులకే దాసరికు పవన్ డేట్స్ కేటాయించడని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం రీసెంట్ గా జరిగిన పొలిటికల్ డవలప్ మెంట్సే. అయితే ఇప్పుడు పవన్ ...కాస్త ఉషారు ఇచ్చారు పెద్దాయనకి.

కరెక్టుగా సంవత్సరం క్రితం దాసరి ఇంటికి ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు పవన్ చూడటానికి వెళ్లి, యోగక్షేమాలు అడిగి, ఓ సినిమా ఆయన బ్యానర్ పై చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ ఇచ్చిన గౌరవానికి, మాటకు ఆయన చాలా సంతోషపడ్డారు.

వెంటనే దాసరినారాయణరావు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు. తమ బ్యానర్ పై తాను నిర్మాతగా పవన్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. అయితే ఈ లోగా ఈక్వేషన్స్ ఛేంజ్ అయ్యాయి. చిరంజీవి, పవన్ ఇద్దరూ క్లోజ్ అవటం జరిగింది.

Dasari happy with Pawan's statement

మరో ప్రక్క దాసరి..వైయస్ ఆర్పీ ప్రెసిడెంట్ వైయస్ జగన్ ని కలిసారు. పవన్ కు జగన్ కు సరైన రిలేషన్స్ లేవనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ ఇక దాసరికి డేట్స్ ఇవ్వటం కల్లే అని అందరూ భావించారు.

కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలలో దాసరికి సినిమా చేస్దాను అన్నమాట నిలబెట్టుకుంటానని ప్రకటించారు. త్వరలోనే ఆ సినిమా ఉంటుందని, దర్శకుడు, కథ ఫైనల్ అవ్వగానే తెలియచేస్తానని అన్నారు. ఈ విషయం విన్న దాసరికి రిలీఫ్ వచ్చిందని అంటున్నారు.

English summary
Pawan has shot down all rumors and specifically said that he would do a film for Dasari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu