మాజీ కేంద్ర మంత్రి, దర్శక, నిర్మాత, రచయిత,నటుడు అయిన దాసరి నారాయణ రావు చాలా గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటానికి రెడీ అవుతున్నారు. ఆయన శిష్యులలో ఒకరు ఆయన్ని 'మేస్త్రి' పాత్రలలో చూపటానికి ఆసక్తి చూపుతున్నారు. బిల్డింగ్ కట్టడానికి మేస్తి ఎలా ఉపయోగపడతాడో అలాగే కుటుంబానికి తండ్రి సేవలు అందిస్తారంటూ కథ సాగుతుందిట. కనస్ట్రక్షన్ పూర్తయ్యాక మేస్త్రి అవసరం ఎలా ఉండదో అలానే ...తండ్రి అవసరం తీరాక ఆయనను గెస్ట్ లా చూస్తారని ఆ కట్టిన ఇంటిలో మరొకరు ఉంటారని ఇన్నర్ మీనింగ్ ట. ఇక ఈ సినిమాని దాసరి తన సొంత బ్యానర్ సిరీ మీడియా ప్రొడక్షన్ ప్రెవేట్ లిమెటెడ్ పై నిర్మిస్తారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. ఆ డైరక్టర్ ఎవరనేది సస్పన్స్ అంటున్నారు.మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది.
Story first published: Thursday, July 16, 2026, 22:57 [IST]