నఫీసాపై మండిపడ్డ దాసరి
15వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఫిల్మ్ సొసైటీపై మండిపడ్డారు. దక్షిణాది అంటేనే ఉత్తరాది వాళ్లకు గిట్టదని చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఎస్ఐ)చైర్ పర్సన్ నఫీసా అలీని సభా ముఖంగానే దాసరి నిలదీశారు. ఆయన మాటల్లోనే...ఎంతో ఖర్చు చేస్తూ రెండేళ్లకోమారు నిర్వహిస్తోన్న ఈ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం మొక్కుబడి తంతులా తయారయింది. ఓ కేంద్రమంత్రిగా నేను ఈ మాటలు చెప్పడంలేదు. 148 సినిమాలకు దర్శకత్వం వహించిన టెక్నీషియన్ గా చెబుతున్నాను. అంకితభావం, అనుభవజ్ఞుల సహకారం లేకుండా జరుగుతున్నాయీ ఫిలిం ఫెస్టివల్స్...శాశ్వత వేదిక అయిన హైదరాబాద్ లో చిల్డ్రన్ ఫిలిం కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది.. కేంద్రం రూ.17కోట్లను ఇచ్చినా ఇప్పటి వరకూ అతీగతీ లేదు. ఈ విషయంలో సీఎఫ్ఎస్ఐ ఎందుకో ముందడుగు వేయలేకపోతోంది..అంటూ నఫీసా అలీని ఉద్దేశిస్తూ...నేను మిమ్మల్ని అడుగుతున్నాను..దేశంలో అత్యధిక చిత్రాలు నిర్మించే చరిత్ర ఉన్న తెలుగు సినిమా నుంచి సొసైటీకి ఎన్నికైన తెలుగువారెవరున్నారు..దక్షిణాది నుంచి కూడా లేరు..శాశ్వత వేదిక అంటూ హైదరాబాద్ ను ఎంచుకున్నారు..కానీ ఇక్కడివారికి కనీస గుర్తింపులేదు..దయచేసి దీన్ని సరిదిద్దండి..మీరు ఎంతసేపు దర్శక నిర్మాతలు బాలల చిత్రాలు నిర్మించాలి అంటారు కానీ వచ్చిన చిత్రాలను మీరెప్పుడైనా ప్రమోట్ చేశారా...దేశంలోనే తొలిసారిగా బాలలకోసం సినిమా తీసింది కెఎస్ ప్రకాశరావు...ఆయన మనవడు, రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ తీసిన బొమ్మలాటను మీ సభ్యులు ఎంతమంది చూశారు. కనీసం ఆ చిత్రంలో నటించిన బాలనటుడికి జాతీయ అవార్డు వచ్చిందన్న సంగతి తెలుసా...దక్షిణాది అనగానే మీకు చిన్నచూపు వీరు ఏమీ చేయలేరని మీ భావన..దక్షిణాదివారు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే గొప్ప చిత్రాలను నిర్మించగలరు...అంటూ నిప్పులు కక్కారు దాసరి.
నఫీసా మాత్రం ఇందుకు స్పందించకుండా ఫిల్మ్ షెడ్యూల్ హ్యాండ్ బుక్ లో తన పేరును తప్పుగా ముద్రించారని, తాము పంపిన లోగోకు మీడియా సెంటర్ లోని బ్యానర్ పై ప్రాధాన్యం ఇవ్వలేదని నఫీసా అలీ నిర్వాహకులపై మండిపడ్డారు.


Click it and Unblock the Notifications











