అందుకే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం: దాసరి
హైదరాబాద్: ''పవన్ కళ్యాణ్, వెంకటేష్‌తో మంచి సినిమాలు చేశాను. నరేష్‌నే పవన్ కళ్యాణ్ అనుకుని ఈ సినిమా చేశాను. మన తెలుగు సినిమాల్లోని హీరో సన్నివేశాలను పేరడీగా చేసి ఈ సినిమా రూపొందించాం. ఇది సినిమా వాళ్లపై సెటైర్ కాదు. సినిమాలపై వ్యంగ్యమంతే. నేను చేసిన పది సినిమాలు ఒక ఎత్తు అయితే ఇదొకటి ఒక ఎత్తు'' అని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెలిపారు. అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా భీమినేని దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి.రెడ్డి నిర్మిస్తున్న 'సుడిగాడు' ఆడియో ఆవిష్కరణ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది
దాసరి పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఉదయ్‌కిరణ్, తనీష్, నిఖిల్‌కు అందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ...''భీమినేని శ్రీనివాసరావు తీసిన సినిమాలన్నీ హిట్టే. పవన్‌కళ్యాణ్‌కి 'సుస్వాగతం' అనే అద్భుతమైన హిట్టిచ్చాడు. అందుకే పవన్‌కళ్యాణ్‌కి భీమినేని అంటే చాలా ఇష్టం. అల్లరి నరేష్ అప్పటికీ ఇప్పటికీ నటనాపరంగా చాలా మెరుగుపడ్డాడు అని చెప్పారు.
చిన్న నిర్మాతల హీరో అల్లరి నరేష్ . అతని కెరీర్‌లోనే 'సుడిగాడు' బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. అలాగే సినిమాలపై సెటైర్‌గా వస్తున్న చిత్రమిది. మనపై మనం జోకులు వేసుకుంటే సరదాగానే ఉంటుంది. ఈ సినిమా చూసి అగ్ర హీరోలు సైతం ఓసారి సరదాగా నవ్వేసుకుంటారు. ప్రతి హీరో అభిమానులు నరేష్ సినిమాల్ని చూసి ఆనందిస్తారు''అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ -''మా నాన్నగారికి బాగా నచ్చిన కథ ఇది. తొలిసారిగా ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. మా సంగీత దర్శకుడు శ్రీ వసంత్‌కు ఈ సినిమాతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవర్నీ కించపరచాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. భీమనేని ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు. శ్రీవసంత్ స్వరాలు అలరించేలా ఉన్నాయి''' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇంకా ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు, దశరథ్, ఆర్పీ పట్నాయక్, రామ్‌ప్రసాద్, అడ్డాల చంటి, కేఎల్ దాము, జి.నాగేశ్వర్‌రెడ్డి, శ్రీ వసంత్, మోనాల్‌గజ్జర్ తదితరులు మాట్లాడారు.


Click it and Unblock the Notifications











