దాసరి మళ్ళీ హాట్ టాపిక్ గా... (వీడియో)
హైదరాబాద్: దాసరి నారాయణ రావు కెరీర్ మొదటి నుంచీ విభిన్నతకు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఆయన సినిమా చేసినా లేదా స్టేట్ మెంట్ ఇచ్చినా అది హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే సినిమాల పరంగా ఆయన ఈ మధ్యకాలంలో చాలా వెనక పడ్డారనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలేవీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ తో చేసిన పరమ వీర చక్ర చిత్రం ఫెయిల్యూర్ తో బాగా విమర్శలు పాలయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన రూపొందిస్తున్న చిత్రంపై అందరి దృష్టీ ఉంది.

ఈ మధ్య సినిమా పేర్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టైటిల్‌తోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాసరి నారాయణరావు కూడా వెరైటీ టైటిల్‌తో రాబోతున్నారు. అదే 'ఎర్ర బస్సు'. దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమిది. మంచు విష్ణు హరో. కేథరిన్ హీరోయిన్. తమిళంలో ఘన విజయం సాధించిన 'మన్జపాయ్' చిత్రానికి ఇది తెలుగు రూపం. ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా విడుదలైంది. ఈ టీజర్ చూసిన వాళ్ళు మళ్లీ దాసరి ఫామ్ లోకి వచ్చాడంటున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ ట్రైలరే అంతా హాట్ టాపిక్ గా మారింది. మీరు కూడా చూసి మీ అభిప్రాయం చెప్పండి.
దాసరి మాట్లాడుతూ...నారాయణస్వామి ఓ పల్లెటూరి మనిషి. ఆయన మనవడికి మాత్రం అమెరికా వెళ్లాలనేది లక్ష్యం. చిన్నప్పట్నుంచి తనకి ఓ స్నేహితుడిలా ఉంటూ వచ్చిన తాతయ్యని మూడు నెలల పాటు బాగా సంతోష పెట్టాలని హైదరాబాద్ తీసుకొస్తాడు. ఆ మూడు నెలల కాలంలో ఏం జరిగింది? పట్నం వచ్చిన తాతయ్య మనవడి కోసం ఏం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు దాసరి నారాయణరావు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఎర్రబస్సు'. ఈ నెల 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
దాసరి మాట్లాడుతూ ''తాతమనవళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా తీర్చిదిద్దాను. సెంటిమెంట్‌తో పాటు వినోదానికీ ప్రాధాన్యముంది. విష్ణు ఉత్తమ నటనను కనబరిచాడు. 'ఎర్రబస్సు' అనే పేరును ఒక గుర్తుగా వాడాం. ఎర్రబస్సు ఎక్కినోళ్లు ఎంత గట్టివాళ్లు అనే విషయం అంతర్లీనంగా అర్థమవుతుంటుంది'' అన్నారు. ''ఇదొక అందమైన కథతో తెరకెక్కిన చిత్రం'' అన్నారు మంచు విష్ణు. ''దాసరి నారాయణరావుగారితో సినిమా చేయాలనే కోరిక 'ఎర్రబస్సు'తో నెరవేరింది. ఈ చిత్రం తర్వాత అందరికీ కొత్త చక్రి కనిపిస్తాడు'' అన్నారు సంగీత దర్శకుడు చక్రి.


Click it and Unblock the Notifications











