దాసరి, మంచు విష్ణు ‘ఎర్రబస్సు’ ఫస్ట్ లుక్ ఇదే...
హైదరాబాద్: మంచు విష్ణుహీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎర్రబస్సు'. కేథరిన్ హీరోయిన్. దాసరి నారయణరావు ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. తమిళంలో విజయవంతమైన 'మాంజాపై' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సినిమా గురించి దాసరి నారాయణరావు మాట్లాడుతూ ...నేను దర్శకత్వం వహిస్తున్న 151వ చిత్రమిది. కథానుగుణంగానే దీనికి ఎర్రబస్సు అనే టైటిల్‌ను పెట్టాం. ఓ అమాయక పల్లెటూరి రైతుకు, అతని మనవడికి మధ్య నెలకొన్న సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అని తెలిపారు.

విమల్, లక్ష్మీ మీనన్, రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కిన చిత్రం మంజాపై. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్, సర్కునమ్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ ఏడాది జూన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్ర రీమేక్ హక్కులను సౌభాగ్య మీడియా లిమిటెడ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ పంజాబీ, రాజస్తానీ, సింధి, భోజ్‌పురీ, ఒరియా..ఇలా ఉత్తారాదికి చెందిన అన్ని భాషల్లోనూ పునర్నిర్మాణ హక్కులు సౌభాగ్య మీడియా సొంతం చేసుకుంది.
కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో రూపొందింది. ఇందులో పల్లెటూరు నుంచి వచ్చే అమాయక తాత పాత్రను దాసరి పోషిస్తుండగా, ఆయన మనవడి పాత్రలో మంచు విష్ణు నటించనున్నారు. బ్రహ్మానందం, యమ్.ఎస్.నారాయణ, కృష్ణుడు, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:చక్రి, సినిమాటోగ్రఫీ: అంజి.


Click it and Unblock the Notifications











