అంతా ఉచితం..సొంత అబ్బ సొమ్మా?

By Staff

Dasari Narayana Rao
'సొంత అబ్బ సొమ్మేదో జనానికి పంచినట్టు ఉచిత పప్పు, ఉచిత ఉప్పు, కరెంటు ఉచితమంటారా..అంటూ దాసరి ఈ సారి మేస్త్రి సినిమాతో విరుచుకుపడబోతున్నారు. అదే సినిమాలో 'రాష్ట్రమంటే నాల్గు కుటుంబాల ఆస్తి కాదురా'.. అంటూ 'మేస్త్రి' చిత్రంలో దాసరి నారాయణరావు ఓ పాటకు డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఈ చిత్రంలోని రెండు పాటలు సమకాలీన రాజకీయాలు, రాజకీయ నాయకుల తీరును పట్టిస్తున్నాయిని విన్నవారు అంటున్నారు. "ఓ తల్లీ నా తల్లీ ఓ భరతమాతా..'' అంటూ సాగే పాటలో 'రాష్ట్రమంటే నాల్గు కుటుంబాల ఆస్తి కాదురా' అనే విమర్శతో పాటు 'సొంత అబ్బ సొమ్మేదో జనానికి పంచినట్టు ఉచిత పప్పు, ఉచిత ఉప్పు, కరెంటు ఉచితమంటూ..' అనే మాటలున్నాయి.

ఇక ఈ పదాలు ఎవర్ని ఉద్దేశించినవో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కుటుంబం, నందమూరి కుటుంబం, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కుటుంబం, టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కుటుంబం.. వెరసి ఈ నాలుగు కుటుంబాలు రాష్ట్ర రాజకీయాధికారంపై పట్టు కోసం భీకర పోటీకి సిద్ధమవుతున్నాయి. ఆ మాటలు వీరినుద్దేసించే అంటున్నారు. అలాగే ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా 'ఉచిత కరెంటు'నీ,'ఉచిత' పథకాలనీ ఉద్దేశించే దాసరి ఈ మాటలు అంటున్నారనేది స్పష్టం.

అలాగే ఈ చిత్రంలో మరో పాట 'నాగమల్లీ దారిలో ఈ నాగమల్లీ దారిలో', "జనం కొరకు నేనూ నా కొరకు జనం అని ఒకడు.. జనమే నన్ను పెంచి పోషించారని ఇంకొకడు.. సమాజానికే జీవితం అంకితమంటుంటే.." అని నేటి రాజకీయ నాయకుల్ని ఎద్దేవా చేసి, సగటు పౌరుణ్ణి "క్రికెట్టులోన ఆటగాడు కాబోడుర నీ హీరో.. వెండితెరల వేషగాడు కాకూడదు నీ హీరో..ఫ్యాక్షనిస్టు పాలెగాడు.. కావద్దు నీ హీరో" అంటూ సాగిపోతుంది. రాజకీయ నాయకుల రోడ్డు షోలనూ ఈ పాట వదల్లేదు. "అభిమానం ముదిరిపోయి, ఉన్మాదం పెరిగిపోయి రోడ్డుషోలకు వెళ్లి యాక్సిడెంటు అయిపోతే.. తల్లిదండ్రుల కన్నీళ్లను ఏ హీరో ఆపలేడు" అంటూ సెటైర్స్ విసురుతుంది.

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత దాసరి నారాయణరావు తెర ముందుకు వస్తున్న సినిమా మేస్త్రి కావటంతో దానిపై చా లా అంచనాలు ఉన్నాయి . అయితే మేస్త్రి చిత్రం మాత్రం పొలిటికల్ సెటైర్ చిత్రం కాదంటున్నారు దాసరి. ఈ విషయం తేలలంటే ఈ పన్నెండవ తేదీ దాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఆరోజే ఈ చిత్రం రిలీజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X