twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసి వ్యవస్థపై దాసరి -జంకుతున్న హీరోయిన్లు?

    By Bojja Kumar
    |

    గతంలో ఒసేయ్ రాములమ్మ లాంటి సెన్సేషన్ సినిమాలు రూపొందించిన దర్శక రత్న దాసరి నారాయణరావు మరోసారి అలాంటి తరహా సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో అధికంగా కనిపించే 'దేవదాసీ' దురాచారాన్ని బేస్ చేసుకుని ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని, లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం అన్వేషన్ సాగుతోందని సమాచారం. అయితే ఆ పాత్రలో నటించనున్న హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

    దాసరి ఇటీవల రూపొందించిన యంగ్ ఇండియా, పరమ వీర చక్ర సినిమాలు ఘోరంగా పరాజయం పాలు కావడం, ప్రస్తుతం సినిమాలపై ఆయన ఆలోచనలు ఇప్పటి జనరేషన్‌కు తగిన విధంగా లేవనే వాదనల నేపథ్యంలో దాసరి రూపొందిస్తున్న ఈ సినిమాలో నటించడానికి ప్రముఖ హీరోయిన్లు ఎవరూ ముందుకు రావడం లేదని, కెరీర్ స్పాయిల్ అవుతుందేమోనని జంకుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య దాసరి పలు సందర్భాల్లో పలువురు హీరోయిన్లను విమర్శించడం వెనక ఇది కూడా ఓ కారణమనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

    English summary
    Dasari Narayana Rao going to make a movie about Devadasi Culture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X