ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ప్రస్తుతం ప్రయాణం చేస్తున్న టాపిక్ దర్శక రత్న స్క్రిప్ట్ ని ఎన్ శంకర్ తెరకెక్కించబోతున్నాడని. ట్రయాంగులర్ లవ్ స్టోరీగా నడిచే ఆ కథ చాలా ఫీల్ తో ఉంటుందని చెప్పుకుంటున్నారు. గతంలో ఎన్నో ఎమోషనల్ తో నడిచే చిత్రాలు దర్శకత్వం వహించి,నిర్మించిన దాసరి కొంతకాలంగా రాజకీయాలు కు దగ్గరై సినిమాలకు దూరమయ్యారు. అప్పటికీ ఆయన కథలు అందించి,ఫైనాన్స్ చేసిన చిత్రాలు రిలీజయ్యాయి. కానీ చెప్పుకోతగ్గ రీతిలో ఒక్కటీ ఆడలేదు. దాంతో ఆయన ప్రస్తుతం కేసరి లా జూలు విదిలించి తన పూర్వ వైభవాన్నిపొందాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క తమిళ్ లో చేరన్ చేసిన తవమాయి,తవమాయి చిత్రాన్ని కొన్నారు. దానిలో నటిస్తూ దర్శకత్వం చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్.శంకర్ రామ్ తర్వాత యే సినిమా చేయలేదు. ఇక ఈ మథ్య చిరంజీవితో అథినాయకుడు చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అదీ మెటీరిలైజ్ కాలేదు. దాంతో ఈ కాంబినేషన్ ఆయనలో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయట.
Story first published: Wednesday, April 22, 2026, 5:12 [IST]