దాసరితో బాలయ్య కన్ఫర్మ్?

ఇక దాసరికి తన సినిమాలను తానే రీమేక్ చేయటం ఇష్టం లేదు. అయినా బొబ్బిలిపులి స్టోరీ లైన్ తీసుకుని పూర్తిగా మార్చి ఈ కాలానికి తగినట్లు తీస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే మిత్రుడు తర్వాత బాలయ్య చేసే ప్రాజెక్టు ఇదే కానుందని సమాచారం. దాసరి కూడా మేస్త్రి సినిమా తర్వాత పక్కా కమర్షియల్ చిత్రం చేయాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే దాసరికి ఈ చిత్రం 149 దర్శకత్వ చిత్రం. ఇవన్నీ ఇలా ఉంటే వరసగా బాలయ్య ఫ్లాపుల్లో ఉన్నారు. దాసరి కూడా అదే పొజీషన్ లో ఉన్నారు. దాంతో ఇద్దరూ ఫ్లాప్ ల నుండి బయిటపడటానికి ప్రయత్నిస్తారు కాబట్టి మరింత పట్టుదలతో చేసే ఈ సినిమా విజయం సాధించే అవకాశం ఉంది. బెస్టాఫ్ లక్ బాలయ్య అండ్ దాసరి.


Click it and Unblock the Notifications











