బిజినెస్ మ్యాన్ కంటే తక్కువ రోజుల్లోనే: దాసరి
'అల్లూరి సీతారామరాజు' 50 రోజుల్లో తీసిన సినిమా. మోసగాళ్లకు మోసగాడు, సర్దార్ పాపారాయుడు 28 రోజుల్లో తీసిన సినిమాలు. నా 'నీడ' చిత్రం 10 రోజుల్లో రూపొందింది. అవి ఏ స్థాయి విజయాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు అంటూ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు అన్నారు. మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన చిత్రం 'బిజినెస్‌మేన్' ఆడియో హెక్సా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి పై విధంగా స్పందించారు.
అలాగే... జడ్జిమెంట్ అనేదే లేకుండా షాట్‌లు మీద షాట్‌లు తీస్తూ... 'ఎడిటింగ్ రూమ్‌లో చూసుకుందాంలే' అని ఆలోచిస్తున్న అసమర్థ దర్శకులున్న నేటి రోజుల్లో... మళ్లీ నాటి దర్శకుల్ని గుర్తు చేస్తూ కేవలం 74రోజుల్లో అద్భుతంగా సినిమా తీసి, శభాష్ అనిపించుకున్నాడు పూరి జగన్నాథ్. ఎన్ని రోజులు సినిమా తీశామన్నది కాదు, ఎంత గొప్పగా తీశామన్నదే ముఖ్యం. ఇక ఎన్ని రోజులు సినిమా ఆడిందన్నది కాదు, ఎంత డబ్బు వసూలు చేసిందన్నది ముఖ్యం అని నిరూపించారు మహేష్, పూరి జగన్నాథ్. పోకిరి, దూకుడు, బిజినెస్‌మేన్ చిత్రాల ద్వారా మూడుసార్లు తెలుగు సినిమా స్టామినాను నిరూపించిన మహేష్‌ని అభినందిస్తున్నాను అని చెప్పారు.


Click it and Unblock the Notifications











