బాలయ్యబాబుని చాలా డిఫరెంట్‌గా...దాసరి
'సింహా' హిట్టవడం వెరీ హ్యాపీ. ఈ హిట్టు..బాలకృష్ణ కోసమో, అభిమానుల కోసమో మాత్రమే కాదు. ఇండస్ట్రీ కోసం హిట్ కావాలి అంటున్నారు దాసరి. రీసెంట్ గా ఆయన ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేయించుకుని ఈ చిత్రం చూసారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ...ఇంతవరకు ఈ సంవత్సరం పెద్ద హిట్ లేదు. 'సింహా' చూశా. సినిమా చాలా బాగా తీశారు. డైరెక్టర్ బాగా హోమ్ వర్క్ చేశాడు. బాలయ్యబాబుని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. రెండు క్యారెక్టర్లకీ విపరీతమైన వైవిధ్యం చూపించాడు బాలయ్య. చాలా సెటిల్డ్ గా ఆ పాత్రల్ని చేశాడు. సెకండాఫ్ వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చాలా బాగా చేశాడు. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' గురించి ఎలా చెప్పుకున్నారో, 'సింహా' గురించి అలా చెప్పుకుంటున్నారు. పరిశ్రమకి ఇది మంచి పరిణామం. మొత్తానికి ఇది వెల్ స్కెచ్డ్ ఫిల్మ్ అన్నారు.
అలాగే 150వ చిత్రం బాలకృష్ణతో అని వినిపిస్తోంది. నిజమేనా అని అడిగితే...5వ తేదీ వరకు ఆగండి. ఆరోజు చెబుతా అన్నారు. ఇక దాసరి ...బాలకృష్ణతో బొబ్బిలి పులి రీమేక్ నే ఈ కాలానికి తగినట్లు మార్చి చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సారి టైటిల్..పరమ వీర చక్ర అని పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేసారు. ఇక ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దాసరి సంస్ధ కొంత మేరకు ఫైనాన్స్ చేస్తుందని అంటున్నారు. అలాగే బొబ్బిలి పులి చిత్రంలో పాపులర్ అయిన జననీ జన్మభూమి అనే టైటిల్ సాంగ్ ని అదే ట్రాక్స్ తో కొద్దిగా సాహిత్యం మార్చి అందించనున్నారు. దాసరి ప్రస్తుతం చేస్తున్న యంగ్ ఇండియా రిలీజ్ అనంతరం ఈ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తారని వినపడుతోంది.


Click it and Unblock the Notifications











