నందితాదాస్‌పై మండిపడ్డ దాసరి నారాయణరావు
చలన చిత్రోత్సవంలో..కార్యక్రమ నిర్వాహకురాలు, నటి నందితాదాస్ తనను నిర్మాతగా సంబోధించడం పట్ల ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మండిపడ్డారు. తెలుగువారంటే.. అందరికీ అలుసైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను నిర్మాతను కాను. దర్శకుడిని. 148 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన వాడిని. ముందు నేను దర్శకుడిని. ఆ తరువాతే నిర్మాతను. అసలు తెలుగు వారంటేనే చాలామందికి అలుసైపోయింది. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే... ఏది చూసుకున్నా ప్రతిభావంతులైన తెలుగు వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి అవార్డుల విషయం వచ్చేసరికి తెలుగు వారిని ఎక్కడో వెనుక సీట్లలో విసిరేస్తున్నారు. సినిమా రంగంలో అయితే మమ్మల్ని సెకండ్ గ్రేడ్ జనాల కింద లెక్క గడుతున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మరెంతో మంది గొప్ప నటీమణులను అందించింది కూడా ఇక్కడి వారే..! ఈ చిన్నచూపు ధోరణి మారుతుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు. హైదరాబాద్‌లో 16 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం పారంభం సందర్భంగా నందితాదాస్,దాసరి గెస్ట్ లుగా అటెండయ్యారు. ఈ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.


Click it and Unblock the Notifications











