Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ లాగ సత్తా ఉన్న నటుడు శ్రీకాంత్: దాసరి
ఎన్టీ రామారావు, కృష్ణలాగా సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేసే సత్తా ఉన్న నటుడు శ్రీకాంత్. వంద సినిమాలు చేసినా శ్రీకాంత్ కెరీర్ కి ఇది ఆరంభం" అంటూ దాసరి నారాయణరావు స్పందించారు.శ్రీకాంత్ నటించిన 'రంగ ది దొంగ' చిత్రం క్రిందటివారం విడుదలైంది. హైదరాబాద్ లో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా పాల్గొని జ్ఞాపికల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రస్తుతం మనకు ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. సినిమాను బడ్జెట్లో తీసే దర్శకులు కావాలి అన్నారు. అలాగే శ్రీకాంత్ మంచి నటుడే కాదు క్రమశిక్షణ ఉన్నవాడు.
మనోహర్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. చక్రి మంచి సంగీత దర్శకుడిగా రోజురోజుకూ ఎదుగుతున్నాడు. జీవి దర్శకుడవుతాడని ఊహించలేదు. పరిణితి ఉన్న దర్శకుడిగా ఈచిత్రాన్ని తెరకెక్కించాడు అన్నారు. విమలా రామన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి జీవీ దర్శకత్వం వహించారు. సి.ఆర్. మనోహర్, సుధాకర్ నాయుడు నిర్మాతలు..ఈ కార్యక్రమంలో తరుణ్, చలపతిరావు, రమేష్‌పుప్పాల తదితరులు పాల్గొన్నారు.