'సింహా' నాలో భయాన్ని పెంచింది దాసరి నారాయణరావు
సింహా నాలో భయాన్నీ, బాధ్యతనీ పెంచాయి. దీన్ని మించిపోయేలా నేను పరమవీరచక్ర చేయాలి అన్నారు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన 'సింహా' అర్థ శతదినోత్సవ కార్యక్రమంలో ఆయన ఛీఫ్ గెస్ట్ గా పాల్గొని మాట్లాడారు. ఆయన మాటల్లోనే...ఒక సినిమా విజయవంతమైతే అందుకు సంబంధించినవాళ్లే సంతోషిస్తారు. 'సింహా' విజయంతో తెలుగు చిత్రసీమ అంతా ఆనందించింది. బాలకృష్ణ మంచితనమే కారణం. చిత్రంలోని ద్విపాత్రల్ని బాలయ్య చాలా కొత్తగా చేశాడు.ఈ సినిమా వెనక ఎంతో శ్రమ, తపన ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతి సన్నివేశాన్ని చక్కగా తీర్చిదిద్దారు. నరసింహా పాత్రలో బాలయ్యని చూస్తుంటే నాకు రామారావు గారే గుర్తొచ్చారు. లో ప్రొఫైల్ సన్నివేశాల్లో బాలకృష్ణ సంభాషణలు పలికిన తీరు అద్భుతంగా ఉంది. బాలకృష్ణ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు చేయాలి.'సింహా' విజయం నా బాధ్యతని పెంచింది. దీన్ని మించే సినిమా తియ్యాలని ప్రయత్నిస్తున్నా" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











