విజృంభించిన దాసరి నారాయణరావు, ఆరు సినిమా ప్రాజెక్టుల ప్రకటన!
చివరగా బాలకృష్ణ హీరోగా 'పరమ వీర చక్ర' చిత్రాన్ని తెరకెక్కించిన దాసరి నారాయణరావు 151వ చిత్రంగా 'వడ్డి కాసుల వాడు' అనే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకుని మే 4వ తేదీన ఈచిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేసే వ్యక్తి చుట్టూ 'వడ్డీ కాసుల వాడు' చిత్రం తిరుగుతుంది. వాస్తవానికి దగ్గరగా ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాకు ముఖ్య పాత్ర అయిన ప్యూన్‌గా నటించబోతున్నాడు దాసరి.
దీంతో పాటు ఓ మూడు సినిమాలను తన సొంత బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు దాసరి తెలిపారు. ఈ చిత్రంలో ఒకదానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించనుండగా, మరో చిత్రానికి సురేష్ కృష్ణ, మూడో చిత్రం ద్వారా కోడైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన రవి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
వీటి తర్వాత మంచు విష్ణు హీరోగా మరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు దాసరి. ఈచిత్రాన్ని మోహన్ బాబు, రమేష్ వడ్డె సంయుక్తంగా నిర్మించనున్నారు. వీటి తర్వాత ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు దాసరి తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications












