twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్ పై దాసరి పరోక్ష విమర్శలు

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు తాజాగా ఆడియో ఫంక్షన్లపై ధ్వజమెత్తారు. ఇటీవలి కాలంలో ఆడియో ఫంక్షన్లు రికార్డింగ్ డాన్సుల్లా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. అది మంచి పరిణామం కాదని, అటువంటి కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటానని దాసరి అన్నారు.

    ఎన్టీఆర్ 'బాద్‍ షా' ఆడియో కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎవరి పేరు ప్రస్తావించకుండా ఘాటైన విమర్శలు చేశారు. ఇవి పరోక్షంగా ఎన్టీఆర్ ని ఉద్దేశించి చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగోతంది.

    మరో ప్రక్క నిర్మాత బండ్ల గణేష్ మంగళవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. 'బాద్‌షా' సినిమా ఆడియో ఆవిష్కరణ సందర్భంగా రాజు అనే అభియాని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాయదుర్గం పోలీసులు బండ్ల గణేష్ తోపాటు పలువురిపై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందున వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్తో పాటు బాద్షా ఆడియో ఫంక్షన్ నిర్వాహకుడు కూడా కోర్టులో లొంగిపోయాడు.

    English summary
    Dasari Narayana Rao indirect commented on jr Ntr for Baadshah audio function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X