నా పుస్తకంలో వారి భాగోతం.. (మెగా ఫ్యామిలీపై దాసరి!)

By Bojja Kumar

హైదరాబాద్: దర్శకరత్నదాసరి నారాయణరావు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దర్శకుడు సురేష్ కృష్ణ రజనీకాంత్‌పై రాసిన 'భాషాతో నేను' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా చేసినవే అనే ప్రచారం మీడియాలో జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ...'సౌతిండియాలో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్‌లే సూపర్ స్టార్లు, సూపర్ స్టార్లను మించిన స్టార్లు లేరు. నా చేతుల మీదుగా ఎంతో మంది స్టార్స్ అయ్యారు. నేను ఎంతో మందిని స్టార్స్ చేసాను. నా సినిమాల్లో ఒక్క చాన్స్ కోసం ఎదురు చూసిన వారు...నేడు నేనొస్తే దాసరి నారాయణరావు లేచి నిలబడడా? అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. అది వాళ్ల నైజం....కానీ రజనీలో అలాంటి వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వంలో ఇప్పుడున్న స్టార్స్ ఎవరూ ఆయనకు సాటిరారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న వారి అందరి చరిత్రలు నాకు తెలుసు. త్వరలో పుస్తకం రాస్తా, నిజాలు రాస్తా, అందరి చరిత్రలు బయట పెడతా' అంటూ వ్యాఖ్యానించారు.

పరిశ్రమలో ఎప్పటి నుంచో దాసరి నారాయణరావు వర్గానికి, మెగాస్టార్ చిరంజీవి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాలా ఏళ్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి అండ్ కో ను ఉద్దేశించి చేసినవే అనే వాదన బలంగా వినిపిస్తోంది.

దాసరి వ్యాఖ్యలను బట్టి చూస్తే.....మూతి మీద మీసం కూడా మొలవని రామ్ చరణ్ లాంటి వాళ్లది నాతో ఛాలెంజ్ చేసే స్థాయా? నాకంటే జూనియర్ చిరంజీవి వస్తే నేను లేచి నిలబడాలా? అని ప్రశ్నించినట్లు ఉందని చర్చించుకుంటున్నారు. ఆ మధ్య దాసరి నారయాణరావు, రామ్ చరణ్ మధ్య పరోక్ష వాగ్వివాదం చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అనే వాదన కూడా వినిపిస్తోంది.

దాసరి తాజాగా ఇంతలా ఫైర్ కావడానికి కారణం ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనే. సినీపరిశ్రమపై వ్యాట్(విలువ ఆధారిత పన్ను) ఎత్తివేత కోసం దాసరి నారాయణరావు అండ్ కో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సంప్రదింపులు జరిపింది. అయితే ఈ క్రెడిట్ దాసరికి దక్కుకండా తానే ఎత్తివేయించాననే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి సీన్ క్రియేట్ చేసారని దాసరి వర్గం ఆరోపిస్తోంది. మరి దాసరి పుస్తకం ఎప్పుడు రాస్తారో? ఎలాంటి రహస్యాలు బయట పెడతారో చూడలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X