»   » హీరోయిన్లు కాదు....ఐటం: దాసరి వివాదాస్పద వ్యాఖ్యలు

హీరోయిన్లు కాదు....ఐటం: దాసరి వివాదాస్పద వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చేతికి మైకు దొరికితే చాలు తనదైన వ్యాఖ్యలుతో చెలరేగిపోతుంటారు దర్శక రత్న దాసరి నారాయణరావు. ఆయన మైకు పట్టారంటూ మీడియాకు వార్తల పంటే. గతంలో పలు సందర్భాల్లో హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాసరి తాజాగా మరోసారి వారిని టార్గెట్ చేసారు.

రవీంద్రభారతిలో జరిగిన ఓ వేడుకలో దాసరి మాట్లాడుతూ...‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరైన హీరోయిన్లు ఒక్కరు కూడా లేరు...ప్రస్తుత్తం హీరోయిన్లుగా చెలామని అవుతున్న వారంతా నటీమణులు కాదు, కేవలం ఐటం భామలే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

గతంలో ఐటం సాంగ్స్ చేసేందుకు సిల్క్ స్మిత, డిస్కోశాంతి లాంటి వారు ప్రత్యేకంగా ఉండే వారు. ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు కూడా ఐటం సాంగ్స్ చేస్తున్నారు. ఒక్కరు కూడా ఐదేళ్లకు మించి ఇండస్ట్రీలో నిలవలేక పోతున్నారు అంటూ కామెంట్ చేసారు దాసరి. మరి దాసరి వ్యాఖ్య్లపై తెలుగు హీరోయిన్లు ఎలా స్పిందిస్తారో చూడాలి.

Dasari Narayana Rao comments on Tollywood Heroines

దాసరి సినిమాల విషయానికొస్తే...
దాసరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదనకు రానుంది. ‘ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. బయటి కథల్ని కూడా వింటున్నాను. దర్శకుడెవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. కథ ఫైనలైజ్ కాగానే అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. సందేశాత్మక కథను ఎంచుకోవాలా? లేదా వినోదప్రధాన ఇతివృత్తంతో సినిమా తీయాలా? అనే విషయంలో కొంత సందిగ్ధత వుంది. ఎలాంటి సినిమా తీసినా పవన్‌కల్యాణ్ స్టైల్, ఇమేజ్‌కు అనుగుణంగానే వుంటుంది' అన్నారు.

English summary
Dasari Narayana Rao Controversial comments on Tollywood Heroines.
Please Wait while comments are loading...