twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి సభ వివాదం: విభేదాలు కాదు, చిరు, బాలయ్య లేనందుకే

    దాసరి సంతాప సభ విషయమై ఎట్టకేలకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది. పెద్ద కర్మకు ఒక రోజు ముందుగానే సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లుప్రకటించింది...

    |

    దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు సంతాప సభ విషయమై పెద్ద దుమారం తర్వాత ఎట్టకేలకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది. ఆయన కుటుంబసభ్యులు ఈ నెల 11న పెద్ద కర్మ నిర్వహిస్తుండటంతో అందులోనే ఈ సభను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈ నిర్ణయం పై విమర్శలు వెల్లువెత్తటం తో వెనక్కి తగ్గి పెద్ద కర్మకు ఒక రోజు ముందుగానే సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రకటించింది...

    సినీ రంగానికి పెద్దదిక్కు

    సినీ రంగానికి పెద్దదిక్కు

    తెలుగు సినీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయి రోజులు గడుస్తున్నా సినీ పరిశ్రమ తరపున ఇంతవరకు సంతాప సభ నిర్వహించలేదు. సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలే దీనికి కారణమంటూ బయల్దేరిన గుసగుసలు బాహాటంగానే విమర్శించే స్థాయికి రావటం తో ఇండస్ట్రీ పెద్దలు స్పందించక తప్పలేదు.

    ఎవరికి ఏ సమస్య వచ్చినా

    ఎవరికి ఏ సమస్య వచ్చినా

    పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, పరిశ్రమకి ఏ సంక్షోభం వచ్చినా అందరికీ గుర్తొచ్చేది ‘గురువుగారు'. సమస్య ఏదైనా.. ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు ‘ఒకసారి గురువుగారితోనూ చర్చించి, నిర్ణయం తీసుకుంటాం' అని చెప్తుంటారు. దాసరి అనే వృక్షం నీడన తలదాచుకుని ఎదిగిన వాళ్లు..,

    తీవ్రస్థాయిలోనే వ్యతిరేక వ్యాఖ్యలు

    తీవ్రస్థాయిలోనే వ్యతిరేక వ్యాఖ్యలు

    చిన్నా, పెద్ద తేడా లేకుండా ‘సమస్య' అనగానే దాసరి పాదాలపై వాలిన వాళ్లు పెద్ద దిక్కు చనిపోతే.. తాము ఎలాగూ ఎదిగారు కనుక ఇక పని లేదనుకుని కడసారిగా గురువుగారిని సాగనంపలేకపోయారా? అంటూ తీవ్రస్థాయిలోనే వ్యతిరేక వ్యాఖ్యలు రావటం తో అసలు విషయం చెప్పక తప్పదనుకున్నారేమో గానీ ప్రెస్ మీట్ పెట్టి సంతాప సభ తేదీ చెప్పి ఊపిరి పీల్చుకున్నారు.

    పెదకర్మ ఈనెల 11న

    పెదకర్మ ఈనెల 11న

    మే 30న పరమపదించిన దర్శకరత్న దాసరి నారాయణరావు పెదకర్మ ఈనెల 11న నిర్వహించనున్నట్లు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు సి. కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఇమేజ్‌ గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుందని చెప్పిన కళ్యాణ్.

    ఒక్కరోజు ముందే

    ఒక్కరోజు ముందే

    కాగా ఈనెల 10న ఫిలింనగర్ రామానాయుడు కళామండపంలో ఇండస్త్రీ నివాళి గా దాసరి నారాయణరావు సంతాప సభ జరగనుందంటూ ఈ సభకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు స్పష్టం చేసాడు. పెద్దఖర్మ జరగటానికి ఒక్కరోజు ముందే దాసరి కి సినీ ఇందస్ట్రీ యావత్తూ కన్నీటీ నివాళి అర్పించటానికి సిద్దమైంది.

    కారణం ఉంది

    కారణం ఉంది

    ఇలా ఆలస్య అవటానికి కూడా ఓ కారణం ఉంది. 80వ దశకంలో స్టార్స్ గా ఉన్న చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారని, వారు అందుబాటులో లేని కారణంగానే ఇంతవరకు సంతాప సభను నిర్వహించలేదని తెలిపారు. 10వ తేదీన సంతాప సభను నిర్వహిస్తామని చెప్పారు.

    నాగార్జున, ,బాలయ్య

    నాగార్జున, ,బాలయ్య

    అగ్ర హీరోలైన చిరంజీవి చైనా టూర్ లో ఉన్నాడు ,బాలయ్య షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడు అలాగే నాగార్జున వేసవి విడిది కోసం ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ కు వెళ్ళాడు దానికి తోడు మిగతావాళ్ళు కూడా అందుబాటులో లేరు కాబట్టి ఆలస్యం అయ్యిందని అందరం కలిసి జూన్ 10న సంతాపసభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి

    ఈ సభకు సినీ పరిశ్రమకు చెందినవారంతా హాజరవుతారని... తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా చైనాలో ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి చైనా పర్యటనకు బయల్దేరిన కొన్ని గంటల్లోనే దాసరి మరణవార్త పరిశ్రమను కుదిపేసింది.

    చివరి చూపుకు కూడా నోచుకోలేదు

    చివరి చూపుకు కూడా నోచుకోలేదు

    చైనా పర్యటనను వాయిదా వేసుకోలేని స్థితిలో ఉన్న చిరంజీవి దాసరి చివరి చూపుకు కూడా నోచుకోలేదు. అందుకే చిరంజీవి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ తరుపున సంతాప సభ భారీగా నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే ఆలోపు వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయటానికే ఈ వివరణ ఇచ్చారట.

    అభాసుపాలయ్యాం

    అభాసుపాలయ్యాం

    సంతాప సభలకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గిపోయింది. ఆ మధ్య కూడా ఒకట్రెండు సంతాప సభలను నిర్వహించి అభాసుపాలయ్యాం. పరిశ్రమలో స్వార్థం పాళ్లు పెరుగుతున్నాయి... దాసరిగారి అంతిమ సంస్కారానికి ఆయన పరిచయం చేసిన వారే గైర్హాజరయ్యారు. ఈ విష సంస్కృతికి చరమగీతం పాడాలి? నాకేంటనే ఆలోచనా ధోరణిని పక్కనపెట్టాలని ‘మా' అధ్యక్షుడు శివాజీరాజా అనటం గమనించ దగ్గ విషయం.

    English summary
    Dasari Narayana Rao Condolence Meet at 10 June 4 PM , Said Tollywood Star producer C.Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X