దర్శకరత్న ఆస్తుల వివాదం: మోహన్ బాబుపై దాసరి కోడలు సంచలనం

చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ప్రముఖ నటుడు మోహన్ బాబు తన శ్రీవిద్యానికేతన్ విద్యార్థులతో తిరుపతిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దాసరి నారాయణరావు కోడలు సుశీల మీడియా ముందుకు వచ్చి మోహన్ బాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి కుటుంబానికి మోహన్ బాబు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

మోహన్ బాబుపై సుశీల ఆరోపణలు

మోహన్ బాబుపై సుశీల ఆరోపణలు

చంద్రబాబు వల్ల నా కాలేజీ పిల్లలకు అన్యాయం జరిగిందని, దీని వల్ల నా మనసు కలిచి వేసిందని మోహన్ బాబు అంటున్నారు. అదే మోహన్ బాబు వల్ల మా ఫ్యామిలీలో దాసరిగారి మనవడికి అన్యాయం జరిగింది. మామగారు ఉన్నపుడు ఆస్తులు పంచుతామని చెప్పారు. సడెన్‍‌గా ఆయన చనిపోయారు. ‘‘మోహన్ బాబుగారు నేను మధ్యవర్తిత్వం తీసుకుని పెద్దమనిషిగా ఉంటానన్నారని, అందరినీ కూర్చోపెట్టి పంపకాలు చేస్తామన్నారని'' మా మరిది దాసరి అరుణ్ కుమార్ చెప్పారని, తర్వాత ఆస్తుల పంపకం విషయం దాటవేస్తూ వస్తున్నారని సుశీల తెలిపారు.

ఇప్పటి వరకు పంపకాలు జరుగలేదు

ఇప్పటి వరకు పంపకాలు జరుగలేదు

దాసరి దాసరి నారాయణరావు ఆస్తుల పంపకాల్లో మోహన్ బాబు పెద్ద మనిషిగా వ్యవహరిస్తారని అనుకున్నానని, దాసరి చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆస్తుల పంపకాలు జరుగలేదని సుశీల చెప్పుకొచ్చారు.

తనకు సంబంధం లేదంటున్నారు

తనకు సంబంధం లేదంటున్నారు

ఆస్తుల పంపకం గురించి దాసరి అరుణ్ కుమార్‌ను అడిగితే మోహన్ బాబు రావాలంటున్నారని... ఇదే విషయం మోహన్ బాబును అడిగితే తనకేం సంబంధమని అంటున్నారని... దాసరి కుటుంబ సభ్యుడిని అని చెప్పుకునే మోహన్ బాబు అదే కుటుంబంలో దాసరి మనవడికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు.

మోహన్ బాబును లాగడం ఒక కుట్ర: అరుణ్ కుమార్

మోహన్ బాబును లాగడం ఒక కుట్ర: అరుణ్ కుమార్

తమ కుటుంబ వివాదంలోకి మోహన్ బాబును లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని తాను భావిస్తున్నట్లు దాసరి అరుణ్ కుమార్ తెలిపారు. సుశీల ఏదైనా ఉంటే తనతో చెప్పాలని... అనవసరంగా దాసరి పేరు లాగుతూ మీడియా ముందుకు వెళ్లడం మంచిదికాదన్నారు. తన తండ్రి చనిపోయాక మోహన్ బాబు మా ఫ్యామిలీకి పెద్దదిక్కుగా ఉన్నారని అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X