సినీ ఇండస్ట్రీలో తొలి రోజు.... దాసరికి అవమానం!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ స్వశక్తితో, టాలెంటుతో ఇండస్ట్రీలో ఎదిగిన స్టార్స్ తొలి నాళ్లలో పలు అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు అనేక సందర్బాల్లో విన్నాం.
హైదరాబాద్: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తమ స్వశక్తితో, టాలెంటుతో ఇండస్ట్రీలో ఎదిగిన స్టార్స్ తొలి నాళ్లలో పలు అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు అనేక సందర్బాల్లో విన్నాం. దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నవారే.
చిన్నతనం నుండే దాసరి నారాయణరావు నాటకాలపై మక్కువతో ఆ రంగంలో బాగా రాణించారు. నాటకరంగంలో గోల్డ్‌మెడలిస్ట్ సంపాదించడంతో పాటు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా పలు అవార్డులు, రివార్డులు పొందారు.

నిర్మాత కోరితేనే సినిమాల వైపు
నాటక రంగంలో పేరున్న రచయితగా, దర్శకుణిగా, నటుడిగా రాణిస్తూ... మరోపక్క ఉద్యోగం కూడా చేస్తూ బిజీగా ఉన్న దాసరిని వై.వి.కృష్ణయ్య నిర్మాత తన సినిమాలో నటించాలని కోరగా సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదని తిరస్కరించారట. దాసరిలోని టాలెంటును చూసిన ఆ నిర్మాత ఆయకు ఉత్తరాలమీద ఉత్తరాలు రాయడం, తన సినిమాలో ప్రధాన హాస్యనటుడి పాత్ర ఉందని, వెంటనే మద్రాసు రావాలని కోరడంతో దాసరి మద్రాసు ట్రైనెక్కేసాడట.

తొలి రోజు అవమానం
‘ప్రతివాడూ ఒక నాటకం వేసేయడం, ఒక కప్పు తెచ్చుకోవడం, కప్పొచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో దిగిపోవడం, వేషం వేసేయాలనుకోవడం.. అసలెప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా నువ్వు?' సినిమా పరిశ్రమలో తొలిరోజు నాకెదురైన ఈసడింపు ఇది అంటూ దాసరి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తానుగా వెళ్లలేదు, అయినా...
కృష్ణ అనే మేకప్‌మేన్ తనకు మేకప్ఖ వేస్తూ తనపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసారట. ఇది నేను బతిమాలితే వచ్చిన అవకాశం కాదు. వాళ్లంతట వాళ్లే అడిగితే వెళ్లాను. ఇదేంటి ఇలా అంటున్నాడు అని నాలో నేనే బాధపడ్డాను... అని దాసరి చెప్పుకొచ్చారు.

ఇంతలోనే షాక్
తొలి రోజు ఇలాంటి అనుభవం ఎదరైందని బాధలో ఉన్న తనకు మరో షాక్ తగిలింది. నన్ను ప్రధాన హాస్యనటుడి వేషానికి అని పిలిచి.... ఇపుడు ప్రధాన హాస్యనటుడి అసిస్టెంట్ వేషం అని చెప్పారు. నాకు ఇస్తామన్న ప్రధాన హాస్యనటుడి పాత్ర అప్పటి ప్రముఖ హాస్యనటుడు బాలకృష్ణ గారికి ఇచ్చేశారు. ఆల్రెడీ షూటింగ్ కూడా చేసారని తెలిసింది. వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి అడిగాను. ఆయనకు తెలియకుండానే ఆ మార్పు జరిగిందని చెప్పడంతో ఏమీ చేయలేక పోయాను, సినీ రంగంలో తొలి రోజు నా అనుభవం ఇదీ అని దాసరి తెలిపారు.


Click it and Unblock the Notifications











