హాస్పిటల్ బెడ్‌పైనే కొత్త సినిమా కథను.. దటీజ్ దాసరి..
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యంతో ఉన్నారని, ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు. అనారోగ్యంతో కిమ్స్ హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న దాసరిని మంగళవారం అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని అచ్చిరెడ్డి ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.
దాసరి నారాయణ దాదాపు పూర్తిగా కోలుకొంటున్నారు. కృష్ణారెడ్డి రూపొందించబోయే కొత్త సినిమా కథ గురించి స్వయంగా గుర్తు చేసి తెలుసుకొన్నారు. భారీ విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించారు. అదీ ఆయన గొప్పదనం. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ దాసరి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నారని అచ్చిరెడ్డి తెలిపారు.
dasari narayana rao atchi reddy kovvuri krishna reddy kims hospital దాసరి నారాయణరావు అచ్చిరెడ్డి కొవ్వూరి ఎస్వీ కృష్ణారెడ్డి కిమ్స్ హాస్పిటల్


Click it and Unblock the Notifications