గూండాయిజం: మళ్లీ దాసరి హాట్ కామెంట్స్, లౌక్యంపై..

By Srinivas

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో గూండాయిజం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 'లౌక్యం' సినిమా విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఓ అగ్ర హీరో సినిమా కోసం దాన్ని తీసివేశారని ఆరోపించారు.

అయితే, ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితులను గతంలో తానెన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో 'లక్ష్మీ రావే మాయింటికి' అనే సినిమా ఫంక్షన్లో పాల్గొన్న దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎస్పీ బాలుకు సాలూరి పురస్కారం

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు స్వర్గీయ డా. సాలూ రి రాజేశ్వరరావు జయంతి సందర్భంగా రసమయి సంస్థ ప్రతి ఏటా అందించే సాలూరి ప్రతిభా పురస్కారాన్ని ఈ ఏడాదికిగాను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అందజేయనున్నట్టు రసమయి అధ్యక్షుడు డాక్టర్ ఎంకే రాము తెలియజేశారు.

Dasari Narayana Rao hot comments again

గత 13 సంవత్సరాలుగా లలిత సంగీతానికి, చలనచిత్ర సంగీతానికి సేవలందిస్తున్న సంగీతజ్ఞులకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈనెల 25న రవీంద్రభారతిలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణ, శాంతా బ యోటెక్స్ అధినేత వరప్రసాదరెడ్డి, సాలూరి కోటి, సాలూరి వాసూరావు, సాలూరి పూర్ణచంద్రరావు పాల్గొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X