ఎన్టీఆర్ తో 30 అడుగుల...

'సర్దార్ పాపారాయుడు' చిత్రం షూటింగ్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ నటించినప్పుడు తాను ఆయన పాదాభివందనం చేశాననీ, ఆయన భారతదేశంలోనే మహోన్నత నటుడనీ కొనియాడారు. పౌరాణిక, జానపద, సాంఘిక చారిత్రాత్మక చిత్రాలకు సంబంధించి ఏ పాత్ర పోషించినా ఆయనకు ఆయనే సాటని అన్నారు. చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తర్వాత ఏదైనా ప్రతిష్ఠాత్మక పురస్కారం ఉందంటే అది ఎన్టీఆర్ జాతీయ అవార్డు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును తనకు ప్రకటించడం ఎనలేని సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ అవార్డును దాసరికి ప్రకటించారనే వార్త తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు కొడాలి నానితో కలిసి దాసరిని కలుసుకుని అభినందనలు తెలియజేశారు. సినీ రచయితల సంఘం తరఫున పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, కార్యదర్శి రాంప్రసాద్, దర్శకులు బి.గోపాల్, కృష్ణారెడ్డి తదితర ప్రముఖులంతా దాసరికి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. నటరత్న ఎన్టీఆర్ తో 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' వంటి సంచలన హిట్ లు దాసరి ఇచ్చారనీ, ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ అవార్డు దాసరిని వరించడం అభినందనీయమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎన్టీఆర్ జాతీయ అవార్డునుకు ఎంపిక కావడంతో పరిశ్రమ వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తవుతోంది. దాసరి ఇంటినిండా బుధవారంనాడు పండుగ వాతావరణం నెలకొంది. పరిశ్రమలోని 24 విభాగాలు చెందిన ప్రముఖులంతా దాసరిని అభినందలతో ముంచెత్తారు.


Click it and Unblock the Notifications











