ఆ సినిమాల కలెక్షన్స్ పబ్లిసిటీ స్టంటే : దాసరి
'సినిమా ఇన్ని కలెక్షన్లు సాధించింది అంటూ ప్రతికల్లో వచ్చే ప్రకటనలు, టీవీల్లో వచ్చే వసూళ్ల వార్తలు నిజం కాదు. ఒకటి రెండు సినిమాలు మినహా మిగతా చిత్రాల వసూళ్లన్నీ కేవలం పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నవే' అన్నారు దర్శక రత్న దాసరి నారాయణరావు. మేస్త్రీ చిత్రానికి 2009 ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఆయన మాట్లాడుతూ..సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని, టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి పరిశ్రమ బాగుందని భావించి పన్నుల మీద పన్నులు విధించాలని ప్రభుత్వం నిర్ణయం తసుకోవద్దని ముఖ్యమంత్రికి విన్నవించారు. దేశంలో సినీ పరిశ్రమ కష్టాలో ఉంది, కేవలం 6,7శాతం శాతం మాత్రమే విజయం సాధిస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రణబ్ ముఖర్జీ సేవా పన్ను ఎత్తివేశారు అని గుర్తు చేశారు. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వ్యాట్ లేదు..మన రాష్ట్రంలో కూడా సినిమాలపై వ్యాట్ ఎత్తివేస్తే పరిశ్రమకు మరింత మేలు చేసినవారు అవుతారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఈ రోజు తెలుగు పరిశ్రమ దేశంలో రెండో స్థానంలో ఉండటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమే అన్నారు. ఉత్తమ నటుడి ఇప్పటి వరకు 3 నందులు, ఓవరాల్‌గా 19 నందులు అందుకున్నట్లు దాసరి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











