మెగా ఒత్తిడి: తన వ్యాఖ్యలపై దాసరి నారాయణరావు వివరణ!
హైదరాబాద్: ఇటీవల ‘లక్ష్మీ రావే మాయింటికి' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ...టాలీవుడ్‌లో రోజు రోజుకు రౌడీయిజం పెరిగిపోతుందన్నారు. చిన్న చిత్రాలు, వాటి నిర్మాతలు కొందరి పెద్దల రౌడీయిజానికి నలిగిపోతున్నారు. మంచి కలెక్షన్స్‌తో నడుస్తోన్న ‘లౌక్యం' చిత్రాన్ని ఒక పెద్ద సినిమా కోసం దాదాపు 30 థియేటర్ల నుండి తొలగించారు. ఈ విషయం తెలిసి ఎంతో బాధ వేసింది. అయితే మూడు రోజుల కంటే ఎక్కువగా ఆ చిత్రం థియేటర్లలో నిలువలేదు' అని దాసరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే దాసరి వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించేనని....ఆయన పరోక్షంగా రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం గురించి అలా అన్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలతో దాసరి నారాయణరావుపై అన్ని వైపులనుండి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వారి గురించి కాదన్నారు.
బుధవారం దాసరి మీడియాతో మాట్లాడుతూ...నేను ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా పరిశ్రమ గురించే మాట్లాడతాను, వ్యక్తులను ఉద్దేశించి నేనెప్పుడూ మాట్లాడను. నా మాటలకు...మీ ఊహాగానాలు ఆపాదించి రాయొద్దు. నేను మాట్లాడిన మాటల్లోని స్పిరిట్‌ను తీసుకోండి. కానీ నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్లు దయచేసి వార్తలు రాయవద్దు అన్నారు.


Click it and Unblock the Notifications











