త్వరలోనే దాసరి 'దుర్మార్గం' బయిటకు
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మూడు చిత్రాలతో తలమునకలుగా ఉన్నారు.వచ్చే ఏడాదికి ఇవి విడుదల కావచ్చని తెలుస్తోంది. దాసరి సన్నిహితవర్గాలు మాట్లాడుతూ వీటికి స్క్రిప్ట్‌లు తయారవుతున్నట్లు తెలిపారు.'రామసక్కని తల్లి ' 'కౌన్ బనే ముఖ్యమంత్రి' 'దుర్మార్గం' చిత్రాలు ఒకదానికొకటి భిన్నమైనవి. స్క్రిప్ట్‌లు తయారైన తర్వాత తదనుగుణంగా తారాగణాన్ని ఎంపిక చేస్తారు. ఇప్పటికైతే ఎలాటి వివరాలు తెలియరాలేదు. దాసరి దర్శకత్వంలోని ' పరమవీరచక్ర' జాతీయసమైక్యత ప్రబోధానికి గాను 201 సరోజినిదేవి అవార్డు సాధించింది. వీటిల్లో మొదట 'దుర్మార్గం' సినిమా మొదట బయిటకు వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో బిజీ గా ఉన్నాయన ఒకేసారి ఈ మూడు సినిమాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుద్దామనే ఆలోచనలో ఉన్నారు. తన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ఈ 'దుర్మార్గం' లో నటిస్తారని, ఓ స్టార్ హీరో కీలక పాత్ర చేస్తారని తెలుస్తోంది. ఇక 'కౌన్ బనే ముఖ్యమంత్రి' చిత్రాన్ని ఆయన పొలిటికల్ సెటైర్ గా హిందీలో చేసే ఆలోచనలో ఉన్నారు. సంజయ్ దత్ తో ఈ మేరకు సంప్రదింపులు జరిపారు. 'రామసక్కని తల్లి ' విషయానికి వస్తే ఈ చిత్రంలో అనూష్కని అడిగారు కానీ వర్కవుట్ కాలేదు. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్ చేత చేయించి మరో ఒసేయ్ రాములమ్మ ని క్రియేట్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు.


Click it and Unblock the Notifications











