జూ ఎన్టీఆర్‌పై దాసరి వివాదస్పద కామెంట్స్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ గురించి దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రముఖ చిత్ర నిర్మాత కె . రాఘవ సన్మాన సభలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ...'దురదృష్ట వశాత్తూ మన చరిత్ర మరుగున పడిపోతోంది. ఎన్టీఆర్ అంటే- ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ అనుకునే పరిస్థితి దాపురించింది' అని వ్యాఖ్యానించారు.
అయితే ప్రత్యేకంగా జూ ఎన్టీఆర్ పేరు చెబుతూ దాసరి ఈ వ్యాఖ్యలు చేయడంపై జూ ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినీయర్ ఎన్టీఆర్‌ను ఎవరూ మరిచిపోలేదని, ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉందని అంటన్నారు. ఇండస్ట్రీలో పెద్దమనిషిగా ఉన్న దాసరి అలా మాట్లాడి ఉండి కూడదని అభిప్రాయ పడుతున్నారు.

తెలుగు దేశం పార్టీ వ్యవహారాల కారణంగా ఓ వైపు నందమూరి ఫ్యామిలీ విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో......దాసరి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. జూ ఎన్టీఆర్‌కు లభిస్తున్న ఆదరణ సహించ లేకనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని పలువురు ప్యాన్స్ అభిప్రాయ మండి పడుతున్నారు. మరి దాసరి వ్యాఖ్యలపై జూ ఎన్టీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'రభస' చిత్రంలో నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











