సినీ ఇండస్ట్రీలో కలకలం.. దాసరి నారాయణరావు కొడుకు మిస్సింగ్.. కారణాలివే!

దివంగత దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు అదృశ్యమయ్యాడనే వార్త సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకు గురి చేసింది. దాదాపు వారం రోజుల క్రిందట ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. ఎవ్వరూ ఊహించని ఈ ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా దాసరి కొడుకు గురించే చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి పోతే..

ఆస్తి వివాదాలు, భార్యతో గొడవలు

ఆస్తి వివాదాలు, భార్యతో గొడవలు

గత కొన్నేళ్లుగా దాసరి నారాయణ రావు కుటుంబంలో పలు వివాదాలు రాజుకుంటున్నాయి. దాసరి మరణించిన తర్వాత ఆ వివాదాలు మరింత విజృంభించాయి. ఆస్తి పంపకాల నేపథ్యంలో దాసరి పెద్ద కొడుకు దాసరి ప్రభుకి, ఆయన భార్య సుశీలకి మధ్య కొన్ని వివాదాలు తలెత్తడం జరిగింది.

మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు

మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు

ప్రభు భార్య సుశీల దాసరి నారాయణ రావు ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం జరగలేదని అప్పట్లో పెద్ద హంగామా చేసింది. ఈ విషయంలో పెద్దమనిషిగా ఉన్న నటుడు మంచు మోహన్ బాబుపై కూడా సంచలన ఆరోపణలు చేయడం చర్చినీయాంశం అయింది. అయితే ఆ తర్వాత మెల్లగా సద్దుమణిగిన ఈ వ్యవహారం తాజాగా దాసరి ప్రభు అదృశ్యం కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది.

వారం అయినా కూడా జాడ లేదు

వారం అయినా కూడా జాడ లేదు

ఈ నెల 9 వ తేదీన ఇంటినుంచి బయటికి వెళ్లిన దాసరి ప్రభు ఇప్పటి వరకూ జడ లేడు. ఆయనకు సంబందించిన కమ్యూనికేషన్ సాధనాలు కూడా పనిచేయడం లేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. దీంతో ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

దాసరి ప్రభు కనిపించక పోవడంపై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు దాసరి ప్రభు మిస్సింగ్ పై విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 ఇప్పుడే కాదు.. గతంలో కూడా

ఇప్పుడే కాదు.. గతంలో కూడా

దాసరి ప్రభు ఇలా అదృశ్యం కావడం ఇప్పుడే కాదు.. గతంలో కూడా జరిగింది. 2008లో కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయిన ఆయన తిరిగి వచ్చి తన భార్య సుశీలే తనను కిడ్నాప్ చేయించిందని ఆరోపించాడు. దాసరి ప్రభు, సుశీల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఆయన అదృశ్యం వెనుక కుటుంబ పరమైన కలహాలే కారణాలుగా ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X