twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణని హీరో చేద్దాం అని దాసరి ఎన్టీఆర్ వద్దకు వెళితే.. ఆ సూపర్ సెన్సేషన్ మూవీ ఏంటో తెలుసా!

    |

    Recommended Video

    Dasari Narayana Rao Birthday Celebrations : Celebrities Speech

    దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ వద్ద దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దాసరి జ్ఞాపకార్థం సినీ ప్రముఖులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, బాలకృష్ణ, మురళి మోహన్ వంటి సినీప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా దాసరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

    దాసరి నారాయణ రావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది దాసరి అనారోగ్య కారణంగా తుదిశ్వాస విడిచారు. దాసరి మరణించిన తరువాత తొలి జయంతి వేడుకలు కావడంతో నేడు ఫిలిం ఛాంబర్ వద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.

     దర్శకుడు కాకముందు నుంచే

    దర్శకుడు కాకముందు నుంచే

    దాసరి నారాయణరావు తనకు దర్శకుడు కాకముందు నుంచే పరిచయం అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. మానాన్న నిర్దోషి చిత్రానికి దాసరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత మేనకోడలు, హంతకుడు దేవాంతకుడు వంటి చిత్రాలకు డైలాగ్స్ రాసారని, తాను నటించిన మరెన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని కృష్ణ అన్నారు.

    150 చిత్రాలంటే మాటలు కాదు

    150 చిత్రాలంటే మాటలు కాదు

    దాసరి 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారని అన్నారు. గతంలో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన వారు లేరని, ఇక మీదట రారని కృష్ణ అన్నారు.

    విజయ నిర్మల మాట్లాడుతూ

    విజయ నిర్మల మాట్లాడుతూ

    విజయ నిర్మల మాట్లాడుతూ.. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాతమనవడు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఆ చిత్రం కోసం తనని అడిగినప్పుడు తాను బిజీగా ఉన్నానని దాసరితో అన్నారు. కానీ పట్టుబట్టి తనని నటింపజేశారని, ఆ చిత్రం చేయకపోయి ఉంటె అద్భుతమైన పాత్ర కోల్పోయే దాన్ని అని విజయనిర్మల అన్నారు.

    ఇంట్లో సమస్యగా భావించేవారు

    ఇంట్లో సమస్యగా భావించేవారు

    నీదారిలో నువ్వు నడువు.. విజయం వరిస్తుందని నాన్నగారు చెప్పేవారు. ఆ కోవకు చెందినవారే దాసరి అని బాలయ్య అన్నారు. ఇండస్ట్రీలో చిన్న సమస్య వచ్చినా తన ఇంట్లో సమస్యగా భావించి పరిష్కరించేవారని బాలయ్య కొనియాడారు. ఆయన 150 వ చిత్రం పరమవీర చక్రలో తాను నటించడం చాలా ఆనందం కలిగించిందని బాలయ్య అన్నారు.

    శివరంజని కోసం నాన్నని అడిగితే

    శివరంజని కోసం నాన్నని అడిగితే

    దాసరి దర్శకత్వం వహించిన శివరంజని చిత్రానికి హీరోగా మొదట తనని అనుకున్నారని బాలయ్య తెలిపారు. ఈ విషయం గురించి దాసరి నాన్నగారిని(ఎన్టీఆర్) అడిగారు. బాబు చదువుకుంటున్నాడు ఇప్పుడు వద్దులే అని నాన్నగారు అన్నారు. దాసరి ముక్కు సూటిగా మాట్లాడే మనిషి అని, న్యాయం వైపు నిలబడే వారని బాలయ్య దాసరిని కొనియాడారు.

     మురళి మోహన్ మాట్లాడుతూ

    మురళి మోహన్ మాట్లాడుతూ

    మురళి మోహన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, దాసరి చెన్నైలో ఉన్న పుడు ఓ సంఘటన తనకు గుర్తు ఉందని అన్నారు. దాసరి 2, 3 గంటలవరకు పడుకునే వారు కాదు. ఆ సమయానికి ఎన్టీఆర్ నిద్ర లేచేవారు. ఎన్టీఆర్ ఓ మాట అన్నారు. మా వీధిలో గురేఖలు అవసరం లేదు. నేను పడుకున్న సమయంలో దాసరి మేల్కుని ఉంటారు. ఆయన పడుకునే సమయానికి నేను నిద్ర లేచేవాడిని అని ఎన్టీఆర్ అన్నట్లు మురళి మోహన్ అన్నారు. ఇలా ప్రముఖులంతా దాసరితో అనుభవాలని పంచుకున్నారు.

    English summary
    Dasari Narayana Rao Statue Inauguration At TFCC Office. Krishna and Balakrishna participate this event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X