అవార్డులెలా వస్తాయి?, చరణ్ అభినందీయుడు: దాసరి
ఆరు పాటలు, ఆరు ఫైట్లతో రికార్డింగ్ డాన్సులు చేస్తే అవార్డులు రావని, కేవలం వీటితోనే సినిమాలు తీస్తూ తెలుగు వారికి అవార్డులు రావడం లేదని బాధ పడటం ఎందుకు? అసలు పురస్కారాల స్థాయిలో మనం ఆలోచించడమే లేదు...అని వ్యాఖ్యానించారు దర్శక రత్న దాసరి నారాయణరావు.
అరణ్య కాండ' అనే తమిళ చిత్రానికి పని చేసి జాతీయ ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారాన్ని సొంతం చేసుకున్న తెలుగు కుర్రాడు కె.ఎల్. ప్రవీణ్ ను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సోమవారం సత్కరించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మన తెలుగు కుర్రాణ్ని ప్రోత్సహించిన తమిళ చిత్ర పరిశ్రమను అభినందించాలన్నారు.
ఒక సినిమా తలరాతను మార్చేది రెండే విషయాలే. అందులో ఒకటి కథైతే, మరొకటి ఎడిటింగ్ విభాగం. ఇటీవల ఎడిటింగులో ఎన్నో మార్పులు వచ్చాయి. కథను ఆకట్టుకునేలా చెప్పడంలో ఎడిటింగ్ కీలకంగా పని చేస్తోంది. మన తెలుగు వాడు అంతటి ముఖ్యమైన శాఖలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అరణ్యకాండం' చిత్రాన్ని నిర్మించింది బాలు తనయుడు చరణ్. జాతీయ అవార్డుకు అర్హమైన ఈచిత్రాన్ని నిర్మించిన చరణ్ అభినందనీయుడు అని దాసరి అన్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని, దీనికి కారణం చరణ్ కు తనపై ఉన్న నమ్మకమే అన్నారు.


Click it and Unblock the Notifications











