twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సామాజిక అంశాలపై సినిమాలు, రెండుతరాల హీరోలతో సినిమాలు, స్టోరీయే హీరో

    నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషిచేసిన శ్రామికుడు దర్శకరత్న దాసరినారాయణరావు కథకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. కథనే తన సినిమాకు హీరోగా భావించేవాడు.

    By Narsimha
    |

    హైదరాబాద్: నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషిచేసిన శ్రామికుడు దర్శకరత్న దాసరినారాయణరావు కథకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. కథనే తన సినిమాకు హీరోగా భావించేవాడు.

    దర్శకరత్న దాసరినారాయణరావు తెలుగుసినిమా రంగం అభివృద్దికోసం అహర్నిశలు కృషిచేశారు.అనేకమంది దాసరికి ఏకలవ్య శిష్యులు సినీరంగంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

    దాసరినీడలో అనేకమంది ప్రతిభావంతులైన దర్శకులు ఎదిగారు. బహుముఖ ప్రతిభా పాటవాలు కలిగిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. మాటలు, పాటలరచయితగా కూడ ఆయన అనేక సినిమాలకు పనిచేశారు.

    తెలుగుసినిమారంగంలో దర్శకులకు కూడ అభిమానులను తయారుచేసుకొన్న ఘనత దాసరికే దక్కింది. దాసరి పేరుతోనే సినిమాలు నడిచే పరిస్థితికి చేరిందంటే ఆయనకున్న చరిష్మాను అర్థం చేసుకోవచ్చు.

    కథకే తలవొంచేవారు

    కథకే తలవొంచేవారు

    దర్శకరత్న దాసరినారాయణరావు సినీరంగంలో ఎవరికీ తలవంచలేదు, కానీ, కథకు మాత్రం తలవంచేవారు.కథను ఎంపికచేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కథల విషయంలో ఆయన అనేక ప్రయోగాలు చేశారు. ఆయన ఎంపికచేసుకొన్న కథలు ప్రేక్షకులను కట్టిపడేసేవి.తాను తొలి సినిమాకు దర్శకత్వం వహించిన సినిమా నుండి చివరి సినిమా ఎర్రబస్సు వరకు ఆయన తన దారిని మార్చుకోలేదు.

    సామాజిక స్పృహతో సినిమాలు

    సామాజిక స్పృహతో సినిమాలు

    దాసరి సినిమాల్లో ప్రధానంగా సామాజిక అంశాలను కథలుగా ఎంచుకొనేవారు. ఆనాడు ఎన్టీఆర్ తో బొబ్బిలిపులి, సర్ధార్ పాపారాయుడు లాంటి సినిమాలతో పాటు ఒరేయ్ రిక్షా, ఓసేయ్ రాములమ్మ లాంటి విప్లవ కథాంశాలతో ఆయన సినిమాలను తీశారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై దాసరి నిశితంగా సినిమాలను తీసేవారు

    రెండు తరాల అగ్రనటులతో సినిమాలు

    రెండు తరాల అగ్రనటులతో సినిమాలు


    దాసరినారాయణరావు రెండు తరాల అగ్రనటులతో సినిమాలు తీశారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఎఎన్నాఆర్, కృష్ణలతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేశ్ లతో కూడ ఆయన సినిమాలు తీశారు. స్టార్ దర్శకుడిగా ఆయనకు పేరొచ్చినా నటీనటులతో తక్కువ నిర్మాణ వ్యయంలో కూడ సినిమాలు తీశారు.

    అనేక అవార్డులు

    అనేక అవార్డులు

    దాసరినారాయణరావు తీసిన సినిమాలకు అనేక అవార్డులు వచ్చాయి. సినీ దర్శకుడు, నిర్మాతగానే కాదు నటుడిగా కపడ ఆయనయ అవార్డులు దక్కాయి. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు ఆయనను వెతుక్కొంటూ వచ్చాయి. రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. 9 నంది అవార్డులు , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు దాసరి అందుకొన్నారు.

    English summary
    Cine director Dasari Narayana Rao top priority for Story.he directed 151 films in various languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X