దాసరి కర్టెన్ రైజర్ కి మోహన్ బాబు
డా.దాసరి నారాయణరావు తన 149వ చిత్రంగా రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ద్వారా 81 మంది నూతన తారలను పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన నూతన నటీనటులను పరిచయం చేయడం కోసం ఈ నెల 14న కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాత కె.రామకృష్ణప్రసాద్ చెప్పారు. డా. మోహన్ బాబు నూతన తారలను పరిచయం చేస్తారని, 'మా' అధ్యక్షుడి హోదాలో మురళీమోహన్ వారిని స్వాగతిస్తారని, ఈ కార్యక్రమంలో డా.దాసరితో పాటు పలువురు చిత్రప్రముఖులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే "భారతీయుడిగా సాధించు, భారతీయుడిగా మరణించు" అనే అంశాన్ని ప్రభావశీలంగా చెప్పే కథ ఇది అని దాసరి చెప్తున్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితమిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మోహన్ బాబు దాసరి నారాయణరావు యంగ్ ఇండియా కీరవాణి వైయస్ రాజశేఖర రెడ్డి dasari narayana rao young india keeravani surigaadu bobbili puli


Click it and Unblock the Notifications