దాసరి 'యంగ్ ఇండియా' రిలీజ్ డేట్...
నూతన నటీనటులతో దాసరి నారాయణరావు రూపొందించిన 'యంగ్ ఇండియా' మే నెల 7వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని దాసరి స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ..."భారతీయుడిగా సాధించు, భారతీయుడిగా మరణించు అనే అంశాన్ని ప్రభావశీలంగా చెప్పే కథ ఇది. ఈ సినిమా ద్వారా 81మంది నటీ నటులు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అందరూ తెలుగువారే! ఈ సినిమాని నా మిత్రుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితమిస్తున్నాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలు మా చిత్రంలో ఉన్నాయన్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దాసరికి 149వ చిత్రం.
దాసరి నారాయణ రావు యంగ్ ఇండియా కీరవాణి వైయస్ రాజశేఖర రెడ్డి రిలీజ్ డేట్ dasari narayana rao young india keeravani surigaadu bobbili puli sardhar paparayudu


Click it and Unblock the Notifications