twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ పై... దాసరి రూ. 10.5 కోట్ల పెట్టుబడి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారయణరావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఆ మధ్య ఓ సారి చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు డాన్సులు తప్ప నటన రాదని దాసరి విమర్శలు కూడా చేసారు. అప్పుడు అలా విమర్శలు చేసిన దాసరి నారాయణరావు....ఇప్పుడు అదే రామ్ చరణ్ పై కోట్లలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో 'నాయక్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'నాయక్' నైజాం ఏరియా రైట్స్ దాసరికి చెందిన సిరి మీడియా దక్కించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం రూ. 10.5 కోట్ల భారీ మొత్తాన్ని నిర్మాతలకు ఆఫర్ చేసినట్లు సమాచారం.

    'నాయక్' ఆడియో నవంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరయ్యేలా ఈ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

    ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డివివి దానయ్య నిర్మాత. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

    English summary
    Tollywood filmmaker Dasari Narayana Rao had once ridiculed actor Ram Charan Teja saying that he only knew club dance, but not acting. But the same producer has now come forward to shell out Rs 10.5 crore on this young actor. Dasari is reportedly ready to buy the distribution rights of Cherry's upcoming movie Naayak for a whopping price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X