twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడిని అక్కడి నుంచి లేపండి.. దాసరి, చిరంజీవి నాపై కక్ష కట్టారు.. కోటా..

    తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఒకొనొక సమయంలో దీక్ష చేసినందుకు గాను తన కెరీర్‌కు సెగ తగిలిందని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు.

    By Rajababu
    |

    తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఒకొనొక సమయంలో దీక్ష చేసినందుకు గాను తన కెరీర్‌కు సెగ తగిలిందని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. అంతేకాకుండా తాను దీక్ష చేపట్టడం సీని ప్రముఖులు దాసరి నారాయణరావు, రామానాయుడు, చిరంజీవిల ఆగ్రహానికి కారణమైందని ఆయన తన గత అనుభవాలను గుర్తు చేసుకొన్నారు.

    దీక్షకు పలువురి మద్దతు..

    దీక్షకు పలువురి మద్దతు..

    సినీ కార్మికుల సంక్షేమం, పరిశ్రమ బాగోగుల కోసం నేను చేపట్టిన దీక్షకు ఎందరో మద్దతు తెలిపారు. మరొకొందరు దీక్షలో పాల్గొంటామని ముందుకు వచ్చారు. ప్రముఖ హీరోలు కూడా వచ్చి నాతోపాటు కూర్చుంటామని చెప్పారు. అయితే వారంత వస్తే జనాన్ని నియంత్రించడం కుదరదని నేనే వారించాను అని కోట తెలిపారు.

    మా అబ్బాయి ఏడ్డాడు..

    మా అబ్బాయి ఏడ్డాడు..

    నేను దీక్ష చేపట్టిన రెండురోజుల తర్వాత మా అబ్బాయి వచ్చి ఒకటే ఏడుపు. వాడు నన్ను పట్టుకొని చాలాసార్లు ఏడ్చాడు. ‘మీకెందుకు ఈ దీక్షలు. పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు.. వాళ్ళు చేస్తారు కదా. అలాంటప్పుడు వీటిని మీరు వదిలేయండి, పట్టించుకోకండి' అని నాకు చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.

    నాపై బాధ్యత..

    నాపై బాధ్యత..

    ‘పరిశ్రమలో పెద్ద తరహాగా వ్యవహరించినపుడు, నలుగురు వింటారనే నమ్మకం ఉంది. అందుకే మంచి, చెడు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. మన స్వార్థం మనం చూసుకోకూడదు. పరిశ్రమకు నా వంతు సహాయం చేస్తా అని నా కుమారుడికి సర్దిచెప్పాను అని చెప్పారు.

    దాసరికి, చిరంజీవికి నచ్చలేదు..

    దాసరికి, చిరంజీవికి నచ్చలేదు..

    ఆ సమయంలో నేను దీక్ష చేయడం దాసరి నారాయణరావు, మరికొందరికి నచ్చలేదు అని వీబీ రాజేంద్రప్రసాద్‌, రామానాయుడు వచ్చి ఇదే విషయాన్ని చెప్పారు. ‘వాడిని అక్కడి నుంచి లేపండి ముందు' అని ఆయన చాలామందికి ఫోన్లు చేశారట. దాసరి దీక్ష విరమించమని చెప్పమని చెప్పారు ఏమి చెద్దామని వారు నన్ను అడిగారు. అయితే నేను ఎవర్నో అడిగి దీక్ష చేయడం లేదు. ఎవరో చెబితే దీక్ష చెప్పడం లేదు. ఆయన మాటను వ్యతిరేకించడం కాదు. దీక్ష మొదలుపెట్టాను.. పూర్తి చేయనివ్వండి అని సమాధానం ఇచ్చాను అని కోట తెలిపారు.

    చిరంజీవి కోపగించుకొన్నారు..

    చిరంజీవి కోపగించుకొన్నారు..

    నేను దీక్ష చేపట్టడం వల్ల నాపై చిరంజీవికి కూడా కోపం పెరిగిందని అర్థమైంది. దీక్ష ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో చాలా సినిమాలు మొదలయ్యాయి. పరిశ్రమ కూడా బాగా నిలదొక్కుకున్నది. చాలా మంది హీరోలకు అవకాశాలు వచ్చాయి. మద్రాస్‌లో కో డైరెక్టర్లుగా, అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసిన చాలా మంది డైరెక్షర్లు అయ్యారు.

    అవకాశాలు తగ్గాయి...

    అవకాశాలు తగ్గాయి...

    దీక్ష వల్ల చిరంజీవి సినిమాలు, ఆయన నిర్మాతలు తీసిన చిత్రాలు, దాసరి సినిమాల్లో నాకు అవకాశాలు తగ్గాయి. అయితే కృష్ణ, శోభన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, నరేశ్‌ లాంటి హీరోల సినిమా అవకాశాలు చేతికి దక్కడంతో ఏ రోజు షూటింగ్‌ లేక ఖాళీగా కూర్చోలేదు, వారి ప్రభావం నాపై పడలేదు అని కోట్ చెప్పుకొచ్చారు. వారి లానే పరిశ్రమ మొత్తం కక్ష కట్టి ఉంటే నా పరిస్థితి దారుణంగా ఉండేదేమో అని ఆయన గత అనుభవాలను ఇటీవల ప్రముఖ దినపత్రికతో పంచుకొన్నారు.

    English summary
    Long back Kota Srinivasa Rao organised a deekha at Film Nagar for welfare of film Industry. His deekha got good response from many actors, and technicians. But Chiranjeevi, Dasari are very serious over Kota's action. After deeksha Kota get different kind of treatment from the bigwigs of Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X