దాసరి పద్మ అంత్యక్రియలు పూర్తి
దర్శక రత్న దాసరి నారాయణరావు సతీమణి దాసరి పద్మ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. చేవేళ్లలోని దాసరి ఫాం హౌజ్ లో ఈ అంత్య్రక్రియల పూర్తయ్యాయి. దాసరి వారసులు పద్మ చితికి నిప్పటించారు. ఈ కార్యక్రమానికి సినీ రంగంలోని పలువురు ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు హాజరైన పద్మకు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంత కాలంగా ఊపిరి తిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
దాసరి సొంతగా నిర్మించిన అన్ని చిత్రాలకు పద్మ సమర్పకురాలు. శివరంజని, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా చిత్రాలకు పద్మ నిర్మాతగా వ్యవహరించారు. ఇన్నాళ్లు తనకు తోడు నీడగా, తన వెన్నుతట్టి నడిపించి, తాను ఈ స్థాయికి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన పద్మ లేక పోవడాన్ని దాసరి జీర్ణించుకోలేక పోతున్నారు. మరో వైపు ఇంత కాలం సీని కార్మికులకు అండగా నిలిచిన పద్మ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.


Click it and Unblock the Notifications











