దేశంలోపల దుర్మార్గులపై పోరాటం (పరమవీర చక్ర ప్రివ్యూ)
దాసరి దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తూ రూపొందిన పరమ వీర చక్ర చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది. భారత సేనల పోరాటం బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ కథలో మేజర్ జయసింహ (బాలకృష్ణ) సాహసి,యుద్దరంగంలో ఎదురులేని ధీశాలి. ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే అతను మాతృభూమికి శత్రువుల ముప్పు పొరుగు దేశాల నుంచే కాదు...స్వదేశంలోనూ పొంచి ఉందన్న విషయాన్ని గ్రహిస్తాడు. జయసింహ వారిపై యుద్దం ప్రకటిస్తాడు. ఈ పోరాటంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? జయసింహకీ తెలుగు స్టార్ హీరో చక్రధర్ కీ ఉన్న సంబంధం ఏమిటన్నది తెర మీదే చూడాలి.
తేజ సినిమా పతాకంపై సి.కళ్యాణ్ రూపొందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, హేమ మధ్యన చిత్రీకరించిన రోబో పేరడి నవ్వులు పండించనుంది. అలాగే ఈ సినిమాలో సైనిక శిబిరాలు, యుద్ధాలకు సంబంధించిన దృశ్యాలు, మంచు కొండల్లో తెరకెక్కించిన ఆ ఘట్టాలు హైలెట్స్ గా నిలుస్తాయంటున్నారు. వాటిని కులులో చిత్రించారు.
ఇక బాలకృష్ణ ఈ చిత్రంలో రావణబ్రహ్మ, కొమరమ్ భీమ్ గెటప్పుల్లోనూ బాలకృష్ణ కనిపించనున్నారు. బాలయ్య సరసన అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా హీరోయిన్స్ గా చేసారు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకిది 150వ చిత్రం. ఆయన బాలకృష్ణతో చేస్తున్న తొలి చిత్రమిదే కావటం, సింహా వంటి ఘన విజయంసాధించిన చిత్రం తర్వాత రావటంపై ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, రాజ్ ప్రేమి, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, విజయ్ కుమార్, చలపతిరావు, అశోక్‌కుమార్, బ్రహ్మానందం, అలీ, హేమ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు.
సంగీతం: మణిశర్మ
నిర్మాత: సి.కల్యాణ్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దాసరి నారాయణరావు


Click it and Unblock the Notifications











