నందమూరి అభిమానులుకు ఆ చిత్రం..సంక్రాంతి గిప్ట్

By Srikanya

యువరత్న బాలకృష్ణ తదుపరి చిత్రం పరమవీర చక్ర సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. దర్శకరత్న దాసరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ 18 నుంచి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ నుంచి కంటిన్యూగా గ్యాప్ లేకుండా డిసెంబర్ వరకూ వేరే చేస్తారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నిర్మాత సి.కళ్యాణ్...ఆగస్టు 18 నుంచి కంటిన్యూ షెడ్యూలు ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ కి అన్ని పనులు పూర్తి చేసిన జనవరి 12వ తేదీన సంక్రాంతి గిప్ట్ గా నందమూరి అభిమానులకు ఈ చిత్రాన్ని అందించాలని ప్లాన్ చేస్తున్నాం. బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు రెండు చిత్రాలు సంక్రాంతికి రిలీజైనవే. పరమవీరచక్ర కూడా అదే రేంజి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ..ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆర్మీ మేజర్ గానూ, సినిమా హీరోగానూ కనిపించనున్నారు. అలాగే షీలా, అనుష్క ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X