twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి ఆత్మకథలో... తెరచాటు భాగోతాలు, సీక్రెట్లు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శక రత్న దాసరి త్వరలో తన ఆత్మకథను రాసేందుకు సిద్ధం అవుతున్నారట. ఎప్పటి నుంచో ఆత్మకథ రాయాలనే ఆలోచనలో ఉన్న దాసరి ఇటీవల ఓ సందర్భంలో అనుకోకుండా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. 'మేఘ సందేశం' సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ను కొందరు మీడియా ప్రతినిధులు కలిసారు. ఈ కథకు సంబంధించిన స్ఫూర్తి ఎక్కడి నుంచి పొందారని అడగ్గా...ఆ విషయం తన ఆత్మకథలో చెబుతానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో దాసరి త్వరలో ఆత్మకథను రాబోతున్నారనే విషయం వెల్లడైందని అంటున్నారు.

    దాసరి ఆత్మకథ అనగానే సినీ జనాల్లో ఆసక్తి క్రియేట్ అవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో టాప్ దర్శకుల్లో దాసరి ఒకరు. దివంగత ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి హీరోల వరకు అనేక మందిని ఆయన దర్శకత్వంలో చేసారు. జనాలకు తెరపై కనిపించేది మాత్రమే తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో తెర వెనక చాలా వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.

    ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనించిన దాసరి వాటిని తన ఆత్మకథ ద్వారా బయట పెడతారనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా సినీ పరిశ్రమ ఇప్పుడిలా ఎందుకు తగలడింది? చిన్న నిర్మాతలు ఎందుకు చితికి పోతున్నారు? పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకుని గుత్తాదిపథ్యం సాగిస్తుంది ఎవరు? దీని వల్ల భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అనే వివరాలు కూడా దాసరి తన ఆత్మకథలో చర్చిస్తారని అంటున్నారు. ఏది ఏమైనా దాసరి ఆత్మకథ అనగానే చాలా మందిలో గుబులు కూడా మొదలైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.

    గతంలో మల్లెమాల లాంటి వాళ్లు తన ఆత్మకథలో అనేక ఆసక్తికర విషయాలతో పాటు....ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటూ గొప్ప వారిగా పేరు తెచ్చుకున్న పెద్ద పెద్ద స్టార్లు తెర వెనక ఎలాంటి మనస్తత్వంతో ఉండేవారు, వాళ్ల బుద్ది ఎలాంటిది అనే సంచలన విషయాలు బయటపెట్టి సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దాసరి కూడా తన ఆత్మకథ ద్వారా అలాంటి సెన్సేషన్ సృష్టించడానికి సిద్దం అవుతున్నారట. మరి దాసరి ఆత్మ కథలో ఎంత మంది బండారాలు బయట పడతాయో..?

    English summary
    Darsakaratna Dasari Narayana Rao is busy writing his autobiography? Though he did not announce it officially, yet when the media persons approached him to question him about the source of inspiration for his movie 'Megha Sandesam' that recently completed 30 years of its release, Dasari replied that he would be compiling all that in his autobiography.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X