మా అల్లుడే, అందుకే వచ్చా, మళ్లీ అడగొద్దు: దాసరి

By Bojja Kumar

హైదరాబాద్: కొందరు ఆయన్ను తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్న పెద్ద దిక్కు అని చెబుతుంటారు. ఓ వర్గం మాత్రం ఆయన్ను బొత్తిగా పట్టించుకోదు. ఆ గొడవలను పక్కన పెడితే ఈ మధ్య పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి దగ్గరకు వచ్చి చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా ఈ మధ్య డబ్బింగ్ సినిమాలకు, డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న కొందరు తమ ఆందోళన కార్యక్రమాల్లో దాసరిని భాగస్వామిని చేసారు. దాసరి కూడా ఆ మీటింగులకు వెళ్లి డబ్బింగ్ సినిమాలకు, సీరియళ్లకు వ్యతిరేకంగా భారీ స్పీచులు దంచారు. తెలుగు భాషకు, తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతోందంటూ ప్రసాంగాలు సాగదీసారు.

అయితే అలాంటి దాసరి.... ఈ మధ్య డబ్బింగ్ సినిమా 'విశ్వరూపం' కార్యక్రమంతో పాటు, తాజాగా 'రాజకోట రహస్యం' అనే మరో డబ్బింగ్ సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు. తన వ్యవహార తీరును ఎవరైన తప్పుబట్టే అవకాశం ఉండటంతో ముందే ఓ డైలాగ్ వదిలారు దాసరి.

రాజకోట రహస్యం ఆడియో వేడుకకు హాజరైన దాసరి మాట్లాడుతూ... 'డబ్బింగ్ మూవీ కార్యక్రమాలకు ఇక రాకూడదనుకున్న సమయంలోనే ఎక్కువ మంది పిలుస్తున్నారు. మొన్న కమల్ హాసన్ పిలిస్తే కాదనలేక పోయాను. ఇప్పుడు త్యాగరాజన్, ప్రశాంత్ పిలిచారు. త్యాగరాజన్ మా అల్లుడు. పేకేటి శివరాం గారి అమ్మాయిని చేసుకున్నారు. అందుకే ఈ ఆడియో వేడుకకు వచ్చాను. రేపు ఎవరూ అడగకూడదనే ఈ విషయాన్ని చెబుతున్నాను' అని చెప్పుకొచ్చారు.

'రాజకోట రహస్యం' సినిమా వివరాల్లోకి వెళితే 'పొన్నార్ శంకర్' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'రాజకోట రహస్యం' పేరుతో అనువదించారు. ప్రశాంత్, దివ్య పరమేశ్వరన్, పూజా చోప్రా నాయికా నాయికలు. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈకార్యక్రమానికి దాసరి నారాయణరావు, కృష్ణం రాజు, వివి వినాయక్, పుప్పాల రమేష్, లక్ష్మి మంచు, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X