‘విశ్వరూపం’ బ్యాన్ : దాసరి, రాజమౌళి స్పందన
హైదరాబాద్ : అసలు సినిమా చూడక ముందే, సినిమా విడుదల కాకముందే.....కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రంలో తమ మనోభావాలు దెబ్బతినే విధంగా సన్ని వేశాలు ఉన్నాయనే అనుమానంతో పలు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగడం, తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రంపై 15 రోజుల బ్యాన్ విధించడం తెలిసిందే. కొన్ని కారణాలతో హైదరాబాద్ లో కూడా కొన్నిచోట్ల ప్రదర్శన నిలిపి వేసారు.
రజనీకాంత్‌తో సహా పలువురు సెలబ్రిటీలు సినిమాను వీక్షించి....సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమా ఉందనేది కేవలం అపోహ మాత్రమే అని తేల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శక రత్న దాసరి నారాయణరావు, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కూడా 'విశ్వరూపం' సినిమా వీక్షించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.
'విశ్వరూపం' చిత్రం ఎలాంటి అభ్యంతర కర సన్నివేశాలు లేవని, సినిమాను కమల్ హాసన్ అద్భుతంగా, భారీ నిర్మాణ విలువలతో నిర్మించారని దర్శక రత్న దాసరి నారాయణ రావు వెల్లడించారు. దర్శకులు రాజమౌళి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ విశ్వరూపం పక్కా కమర్షియల్ మూవీ, కమల్ హాసన్ నటన అద్భుతంగా ఉంది, స్పెషల్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉన్నాయని, సినిమా ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని వెల్లడించారు.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు.


Click it and Unblock the Notifications











