దాసరి జయంతిని ‘డైరెక్టర్స్ డే’ ప్రకటిస్తూ నిర్ణయం
మే 4వ తేదీన స్వర్గీయ దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతి ని డైరెక్టర్స్ డేగా నిర్ణయిస్తూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని మే 4వ తేదీ సాయింత్రం 4 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చలర్ సెంటర్‌లో ఒక వేడుకగా నిర్వహించనున్నారు.
తెలుగు సినీ దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతిని ఓ వేడుకగా నిర్వహిస్తామని దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీ ఎన్.శంకర్ ప్రకటించారు.

దాసరి నారాయణరావు గతేడాది మే 30న మరణించారు. ఇండస్ట్రీలో ఏ విభాగంలో సమస్య వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా దాన్ని తన సమస్యగా భావించి పరిష్కరించడంలో దాసరి ముందుండే వారు. దాసరి మరణంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది.
దాసరి అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్ రికార్డుల కెక్కారు. దాదాపు 150 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. దీంతో పాటు 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా, గీతరచయితగా చేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించారు.


Click it and Unblock the Notifications











