twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' రికార్డులును ఉద్దేశించా దాసరి!?

    By Srikanya
    |

    రికార్డులు కొట్టేశాం అని జబ్బలు చరచుకొనేవాళ్లు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టింది? అన్నది కాదు. ఎన్ని లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకొంది? అనేదే ముఖ్యం..అంటూ తాజాగా శ్రీరామ రాజ్యం యాభై రోజుల పంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ స్పందించారు. అయితే ఈ రికార్డులు టాపిక్ ఎవర్ని ఉద్దేశించి అన్నది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంసంగా మారింది. మహేష్ నటించిన దూకుడు రికార్డుల సెన్సేషన్ రీసెంట్ గా అంతటా వినిపించింది. దాన్ని గురించా దాసరి కామెంట్ చేసింది..లేక జనరల్ గా అన్నారా..అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక సాధారణంగా..దాసరి ఏది మాట్లాడినా అందులో ఏదో ఒక కాంట్రావర్సి తొంగి చూస్తేనే ఉంటుంది. నిజాలు నిక్కిచ్చిగా చెప్పే ఆయన మాటలు చాలా మంది కి చురకల్లా తగులుతాయి.

    అలాగే...''లవకుశ', 'శ్రీరామరాజ్యం'... ఇలాంటి సినిమాలు యుగానికి ఒక్కసారే వస్తాయి.రికార్డులు కొట్టేశాం అని జబ్బలు చరచుకొనేవాళ్లు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టింది? అన్నది కాదు. ఎన్ని లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకొంది? అనేదే ముఖ్యం అన్నారు. ఇక ఈ ఏడాది 120 దాకా స్ట్రయిట్ సినిమాలు, 130 దాకా డబ్బింగ్ సినిమాలొచ్చాయి. కానీ అవి ఎలాంటి సినిమాలు? ఒక్కసారి మనం ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అనేది ప్రేక్షకులు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలి. పక్క రాష్ట్రాల్లో యూత్ మంచి సినిమాలనే చూస్తున్నారు. ఇక్కడ యూత్‌కి బూతు కావాల్సి వస్తోంది. 'శ్రీరామరాజ్యం'లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు బాధ్యతగా స్వీకరించి, ఆదరించాలి'' అని డా. దాసరి నారాయణరావు అన్నారు. ఇక ఆయన ఏ ఉద్దేశ్యంతో ఉన్నా రికార్డులు అనగానే అంతా దూకుడునే గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే రికార్డులు,కలెక్షన్స్ మీద ఈ మధ్య ఏ చిత్రానికి జరగనంత హడావిడి దూకుడుకి జరిగింది.

    English summary
    Director Dasari Narayana Rao talk on Records is hot topic in Film circles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X