దాసరి గారూ వదిలారు..బాలకృష్ణ కూడా..(వీడియో)

By Srikanya

హైదరాబాద్ : మేకింగ్ వీడియోలు రిలీజ్ కు ముందే రావటం సర్వ సాధారణమైపోయింది. గతంలో సినిమా రిలీజయ్యాక డివీడితో పాటు రావటమే గగనంగా ఉండేది. అలాంటిది సినిమా షూటింగ్ జరుగుతూండగానే మేకింగ్ కోసం తీసిన దాన్ని ఎడిట్ చేసి వదిలి,ప్రాజెక్టు ఇలా ఉండబోతోందని చెప్పి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దాసరి నారాయణరావు గారు కూడా తన చిత్రం ఎర్రబస్సు కి చెందిన మేకింగ్ వీడియోని వదిలారు. ఈ వీడియోలో బాలకృష్ణ, మోహన్ బాబు, అలీ, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ లు కూడా కనపడతారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

మంచు విష్ణుహీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎర్రబస్సు'. కేథరిన్‌ హీరోయిన్. దాసరి నారయణరావు ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలోని జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'మాన్‌జపై'కిది రీమేక్‌. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన ప్రోమోలు వదలాలని దాసరి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ ...నేను దర్శకత్వం వహిస్తున్న 151వ చిత్రమిది. కథానుగుణంగానే దీనికి ఎర్రబస్సు అనే టైటిల్‌ను పెట్టాం. ఓ అమాయక పల్లెటూరి రైతుకు, అతని మనవడికి మధ్య నెలకొన్న సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అని తెలిపారు.

Dasari's Erra Bus Making Video!

విమల్, లక్ష్మీ మీనన్, రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కిన చిత్రం మంజాపై. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్, సర్కునమ్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ ఏడాది జూన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్ర రీమేక్ హక్కులను సౌభాగ్య మీడియా లిమిటెడ్ సొంతం చేసుకుంది.

తెలుగుతో పాటు హిందీ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ పంజాబీ, రాజస్తానీ, సింధి, భోజ్‌పురీ, ఒరియా..ఇలా ఉత్తారాదికి చెందిన అన్ని భాషల్లోనూ పునర్నిర్మాణ హక్కులు సౌభాగ్య మీడియా సొంతం చేసుకుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో రూపొందింది.

ఇందులో పల్లెటూరు నుంచి వచ్చే అమాయక తాత పాత్రను దాసరి పోషిస్తుండగా, ఆయన మనవడి పాత్రలో మంచు విష్ణు నటించనున్నారు. బ్రహ్మానందం, యమ్.ఎస్.నారాయణ, కృష్ణుడు, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:చక్రి, సినిమాటోగ్రఫీ: అంజి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X