షాకింగ్ న్యూస్: దాసరి కొడుకు వచ్చాడు.. కోడలు మాయమైంది
కొద్దిరోజుల క్రితం దివంగత దాసరి నారాయణరావు పెద్ద కొడుకు దాసరి ప్రభు అదృశ్యమయ్యాడనే వార్త సినీ ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఆ మిస్సింగ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన తిరిగి రావడం జరిగాయి. అయితే దాసరి ప్రభు తిరిగిగొచ్చిన రోజే ఆయన భార్య దాసరి సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మ కనిపించకపోవడం ఇండస్ట్రీ వర్గాలను మరో షాక్‌కి గురిచేస్తోంది. పూర్తి వివరాలు చూస్తే..

దాసరి ప్రభు అదృశ్యం.. కేసు నమోదు
ఈ నెల 9 వ తేదీన ఇంటినుంచి బయటికి వెళ్లిన దాసరి ప్రభు కనిపించక పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ సాగుతుండగానే దాసరి ప్రభు తిరిగొచ్చి స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కనిపించాడు. ఈ మేరకు మిస్సింగ్ పై పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో దాసరి ప్రభు మిస్సింగ్ కేసును క్లోజ్ చేశారు పోలీసులు.

దాసరి కొడుకు కనిపించాడు.. వెంటనే కోడలు మాయం
మరోవైపు దాసరి ప్రభు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రోజే ఆయన సతీమణి దాసరి సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మలు మాయం అయ్యారని సమాచారం. ఆ రోజు మాసాబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్లో ఉన్న వారు ఆ తర్వాత కనిపించకుండా పోయారట. దీంతో తన సోదరి, తన తల్లి కనిపించటం లేదంటూ దాసరి సుశీల సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.

పోలీసుల అన్వేషణ
దాసరి కోడలు కనిపించడం లేదని తాజాగా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దాసరి కోడలు, ఆమె తల్లి కోసం ప్రారంభించారు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు ఇంటికి చెందిన కుటుంబ సభ్యులు ఇలా ఒకరి తర్వాత ఒకరుగా కనిపించక పోవడం ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది.

ఆస్తి తగాదాలే కారణం.. మిస్టరీ
దాసరి కుటుంబ సభ్యుల మిస్సింగ్‌లో ఆస్తి తగాదాలే మూలా కారణమని టాక్ నడుస్తోంది. గతంలో 2008లో దాసరి ప్రభు మిస్సింగ్, ఆ తర్వాత ఆయనే ఇటీవల కనిపించక పోవడం, ఆయన రాగానే ఆయన భార్య మిస్సింగ్ ఇదంతా ఓ పెద్ద మిస్టరీలా తయారయ్యాయి పోలీసులకు.


Click it and Unblock the Notifications











