'పరమవీర చక్ర' సినిమాలో హైలైట్స్ ఏమిటి?
'పరమవీర చక్ర' చిత్రంలో కోర్టు సీన్ సినిమాకే హైలైట్. ఆ సీన్ తీయడం నిజంగా పరీక్షే. ఎందుకంటే కోర్టు సీన్ అనగానే ఎవరికైనా 'బొబ్బిలి పులి' గుర్తుకు వస్తుంది. అందులోనూ రామారావుగారి అబ్బాయితో ఆ సీన్ తీయడం మరింత పరీక్షే. ఆ కోర్టు సీన్ విషయంలో నేను పాస్ అవడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు.ఆయన ఈ చిత్రం ప్రమేషన్ కోసం వివిరిగా మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే ఈ చిత్రం గురించి చెబుతూ...మరో విషయం ఏమిటంటే ఒక మాస్ హీరో తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించడం చాలా అరుదు. 'రక్త సంబంధం', 'చిరంజీవులు' వంటి చిత్రాల్లో రామారావుగారు అలా చేశారు అన్నారు.
ఇక డైలాగులు గురించి చెబుతూ...డైలాగులు చెబితే జనం వినరు అనే అపోహ ఉంది. నిజమే చేతగాని వాళ్లు డైలాగులు చెబితే జనం వినరు. బాలయ్యబాబు వంటి హీరో చెబితే వింటారని అనడానికి మంచి ఉదాహరణ 'పరమవీర చక్ర'. ఈ సినిమాలో మేజర్‌ని దేశద్రోహిగా ముద్ర వేసిన సందర్భంలో ఒక చోట రెండు నిముషాల సేపు ఏ డైలాగు ఉండదు. కేవలం కళ్లతో అభినయిస్తూ ఆ సన్నివేశాన్ని బాలయ్యబాబు చేస్తుంటే ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారు. అందుకే ఈ సినిమాతో బాలయ్యకు జాతీయ అవార్డు వస్తుందని అంటున్నాను.
అంతేకాదు సినీ పరిశ్రమలోని ప్రతి హీరో ఈ సినిమా చూడాలి. చూశాక ప్రతి ఒక్కరూ బొకేతో బాలయ్యబాబు ఇంటికి వెళ్లి అతన్ని అభినందిస్తారని నా నమ్మకం. మేమంతా ఒకటే అనే హీరోలు ఆ పని చేయ్యాలి మరి అన్నారు.అలాగే వ్యక్తుల టాలెంట్ కంటే హిట్‌కే ప్రాముఖ్యత ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు అన్నారాయన.


Click it and Unblock the Notifications











